Saturday, May 11, 2024
- Advertisement -

రఘువీరారెడ్డి ఇంకా అలాంటి కలలు ఉన్నాయా!

- Advertisement -

ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తమ పార్టీ వాస్తవ పరిస్థితి గురించి అర్థం అయ్యీ కానట్టుగా వ్యవహరిస్తున్నాడు. రాష్ట్ర విభజన నేపథ్యంలో.. ఆ పాపానికి ఫలితంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది.

కనీసం రాష్ట్ర అసెంబ్లీలోకి ఎంట్రీ కూడా ఇవ్వలేకపోయింది జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ కు ఏపీలో పెద్ద దిక్కుగా ఉన్నాడు రఘువీరారెడ్డి. ఇప్పుడు విశేషం ఏమిటంటే.. కాంగ్రెస్ ను వీడి బయటకు వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి రప్పిస్తామని అంటున్నాడు ఈయన!

రాష్ట్ర విభజన సమయంలో.. ఎన్నికల ముందు.. అనేక మంది నేతలు కాంగ్రెస్ ను వీడారు. కాంగ్రెస్ కు భవితవ్యం లేదని ఎరిగిన వీళ్లు తలోదిక్కూ చూసుకొన్నారు. కొందరు తెలుగుదేశంలోకి వెళ్లిపోయి ఆ పార్టీ టికెట్ ను సంపాదించుకొని ఇప్పుడు ఎంచక్కా అధికార పార్టీ సభ్యులుగా చెలామణి అవుతన్నారు. ఇక మరికొందరు వైకాపాలో ఉండి ప్రతిపక్ష పార్టీ నేతలం అనిపించుకొంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో రఘువీరారెడ్డి చేసిన ఒక ప్రకటన ఆసక్తికరంగా ఉంది.

కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిపోయిన వారిని తిగిరి తెచ్చేందుకు యత్నాలు చేస్తారట. అందుకోసం ప్రత్యేకంగా కమిటీని కూడా ఏర్పాటు చేశారట. ఈ కమిటీ బయటకు వెళ్లిపోయిన నేతలతో చర్చలు జరిపి.. వారిని తిరిగిపార్టీలోకి తీసుకొస్తుందట. మరి ఈ ప్రకటన.. ఇలాంటి యత్నం.. రెండూ విడ్డూరమే. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ లోకి ఎవరు వచ్చి చేరతారు?!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -