Wednesday, May 1, 2024
- Advertisement -

రఘువీరా పోటీ ఖాయమేనా?

- Advertisement -

ఏపీలో కాంగ్రెస్ ఉనికి చాటుతుందా?, హస్తం పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ అగ్రనేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా?, షర్మిల పార్టీలో చేరికతో సీనియర్ నేతలంతా తిరిగి యాక్టివ్ అవుతారా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ నెల 4న షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇక షర్మిల చేరిక ఒక వైపు అయితే మరోవైపు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు రఘువీరారెడ్డి. వైఎస్‌,రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి తొలి పీసీసీ చీఫ్‌గా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ చతికిలపడటంతో రాజకీయాలకు దూరమయ్యారు. తర్వాత రాహుల్ భారత్ జోడో యాత్రతో తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లో అడుగు పెట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపులో కీ రోల్ పోషించారు.

ప్రస్తుతం సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఉన్న రఘువీరా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుండి బరిలో నిలిచే అవకాశాలున్నాయి. మంత్రిగా ఉన్న సమయంలో రఘువీరా ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి, వివాదరహితుడిగా పేరు ఉండటం కలిసి వస్తుందని భావిస్తున్నారు. మరీ రీ ఎంట్రీతో రఘువీరా గెలుపు రుచి చూస్తారా..?కళ్యాణ దుర్గం ప్రజలు రఘువీరాను ఆదరిస్తారా అన్నది మరికొద్దిరోజుల్లోనే తేలనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -