Sunday, May 5, 2024
- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో సంచలనం..

- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో సంచలనం నమోదైంది పసికూన అఫ్ఘనిస్తాన్‌…డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఆల్ రౌండ్ ప్రతిభతో రాణించిన ఆప్ఘాన్‌…ఇంగ్లాండ్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. బట్లర్,రూట్,బెయిర్ స్టో,కరన్,లివింగ్ స్టోన్ లాంటి ప్రపంచస్ధాయి బ్యాట్స్ మెన్ ఉన్న ఆప్ఘాన్ బౌలర్ల ముందు తలవంచక తప్పలేదు. 69 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ని ఓడించి చరిత్ర సృష్టించింది ఆప్ఘానిస్తాన్.

285 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఏ దశలోనూ ఆప్ఘాన్ బౌలర్లను ఎదుర్కొలేకపోయారు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్. హ్యారీ బ్రూక్‌ 66,డేవిడ్‌ మలాన్‌ (32) తో పర్వాలేదనిపించగా మిగితా బ్యాట్స్‌మెన్ అంతా ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఇంగ్లాండ్‌కు ఓటమి తప్పలేదు. ఆఫ్గాన్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్ 3, ముజీబ్‌ 3, మహమ్మద్‌ నబీ 2 వికెట్లు తీశారు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘాన్…49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్‌ 57 బంతుల్లో 80 పరుగులు చేయగా ఇక్రామ్‌ (58), ముజీబ్‌ ఉర్‌ రహమాన్‌ 16 బంతుల్లో 28, రషీద్‌ ఖాన్‌ (23) పరుగులు చేయడంతో ఆప్ఘాన్ భారీ స్కోరు సాధించింది. అద్భుత ప్రదర్శన కనబర్చిన ముజీబ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కగా అఫ్గాన్‌కు ఇది తొలి గెలుపు కాగా.. ఇంగ్లండ్‌కు మూడు మ్యాచ్‌ల్లో ఇది రెండో ఓటమి. 2011లో భారత్‌ వేదికగానే జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌ చేతిలో పరాజయం పాలైన ఇంగ్లండ్‌ మళ్లీ ఇదే వేదికగా జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో మరో చిన్న జట్టులో చేతిలో ఓడటం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -