Monday, May 6, 2024
- Advertisement -

జాక్ పాట్ కొట్టిన శ్రేయాస్ అయ్య‌ర్‌…

- Advertisement -

ఇంగ్లాండ్ టూర్ నేప‌థ్యంలో విరాట్ కోహ్లీ కౌంటీ క్రికెట్‌ ఆడేందుకు విరాట్‌ జూన్‌లో ఇంగ్లాండ్ వెల్తున్న సంగ‌తి తెల‌సిందే. అయితే అఫ్గానిస్థాన్‌తో జరిగే చారిత్రక టెస్టులో సారథి విరాట్‌ కోహ్లీ స్థానంలో యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

అఫ్గాన్‌ టెస్టు, ఐర్లాండ్‌ సిరీస్‌కు అందుబాటులో ఉండడు. అతడి స్థానంలో శ్రేయస్‌ పేరును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ టెస్టుకు రహానె సారథ్యం వహించనున్న సంగతి తెలిసిందే. ఐర్లాండ్‌తో జరిగే సిరీస్‌కు రోహిత్‌ శర్మ నాయకత్వం వహించవచ్చు. జులై మొదటి వారంలో కోహ్లీ భారత జట్టుతో కలుస్తాడు.దే జరిగితే అయ్యర్‌ అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు.

గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో అయ్యర్‌ను భుజ గాయంతో బాధపడ్డ కోహ్లికి బ్యాకప్‌ ప్లేయర్‌గా ఎంపిక చేసినప్పటికి తుది జట్టులో అవకాశం రాలేదు. అతని స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ అరంగేట్రం చేసి అద్భుతంగా రాణించాడు.

ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడుతున్న చతేశ్వర్‌ పుజారా, ఇషాంత్‌ శర్మ అఫ్గాన్‌ టెస్టుకు అందుబాటులో ఉంటారని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆ సమయంలో వారి షెడ్యూలు ఖాళీగానే ఉందని తెలిపింది. ‘కోహ్లీ స్థానంలో శ్రేయస్‌, జడేజా స్థానంలో అక్షర్‌ పటేల్‌, హార్డిక్‌ పాండ్యా బదులు విజయ్‌ శంకర్‌ పేర్లు సెలక్షన్‌ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుంది.

ఇంగ్లండ్‌లో భారత్‌-ఏ పర్యటనకు అండర్‌-19 సంచలన ఆటగాళ్లు పృథ్వీషా, శుభ్‌మన్‌ గిల్‌, శివమ్‌ మావిల ఎంపిక చేసే యోచనలో బీసీసీఐ సెలక్టర్లున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌ లయన్స్‌ (ఏ), వెస్టిండీస్‌ ఏ జట్లతో భారత్‌-ఏ ముక్కోణపు వన్డే సిరీస్‌ ఆడనుంది. అంతేగాకుండా ఇంగ్లండ్‌ లయన్స్‌తో నాలుగు రోజులు టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనుంది. తుది జట్లను మంగళవారం ప్రకటించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -