Tuesday, April 30, 2024
- Advertisement -

హర్ధిక్ పాండ్య దూరం అయితే.. కప్పు కొట్టడం కష్టమేనా ?

- Advertisement -

ప్రపంచ క్రికెట్ జట్లలో భారత జట్టుకు మేటి జట్టుగా పేరుంది. భీకరమైన బ్యాటింగ్ లైనప్.. పదునైన ఫేస్ దళం ఇలా రెండు విభాగాల్లోనూ టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ టాప్ 3 జట్లలో ఒకటిగా కొనసాగుతోంది. అయితే టీమిండియాలో మొదటి నుంచి అల్ రౌండర్ల కొరత గట్టిగానే ఉంది. గతంలో కపిల్ దేవ్, యువరాజ్ సింగ్ లాంటి ప్లేయర్లు మాత్రమే అల్ రౌండర్ల స్థానాలలో మెరుగ్గా రాణించారు. వెస్టిండీస్, ఆస్ట్రేలియా వంటి జట్లలో అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ రెండు విభాగాల్లోనూ రాణించే అల్ రౌండర్లు పుష్కలంగా ఉన్నారు. కానీ మన టీమిండియాలో మాత్రం మొదటి నుంచి అల్ రౌండర్ల కొరత వేదిస్తూనే ఉంది.

కీలక సమయాల్లో అల్ రౌండర్ల ప్రతిభ జట్టు విజయాల్లో అత్యంత ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు 2011 వరల్డ్ కప్ సాధించడంలో యువరాజ్ సింగ్ కనబరిచిన ప్రతిభ విధితమే. అందువల్ల జట్టులో అధిక సంఖ్యలో అల్ రౌండర్లు ఉండడం చాలా ముఖ్యం. అయితే ప్రస్తుతం టీమిండియాలో ఒక్క హర్ధిక్ పాండ్య మినహా వేరే ఇతర ఆటగాళ్ళేవ్వరు అల్ రౌండర్ జాబితాలో కనిపించకపోవడం గమనార్హం. రవీంద్ర జడేజా అల్ రౌండర్ జాబితాలో పర్వాలేదనిపించిన గాయం కారణంగా టి20 వరల్డ్ కప్ కు దూరం అయ్యాడు. ఇక అశ్విన్ అల్ రౌండర్ గానే ఉన్నప్పటికి చురుక్కుగా బ్యాటింగ్ చేయడంలో విఫలం అవుతున్నాడు.

అల్ రౌండర్ భాద్యత అంతా ఒక్క పాండ్య పైనే పడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ పాండ్య గాయం కారణంగా జట్టుకు దూరమైతే అతడి స్థానాన్ని రీప్లేస్ చేసే ఆటగాడు లేకపోవడం గమనార్హం. అందుకే సెలక్టర్లు కూడా సౌతాఫ్రికా టి20 సిరీస్ లో పాండ్య కు రెస్ట్ ఇచ్చి ఫ్రెష్ గా టి20 వరల్డ్ కప్ లో రంగంలోకి దించారు. ఎలాంటి సమయాల్లోనైనా తన హార్డ్ హిట్టింగ్ తో మ్యాచ్ స్వరూపన్నే మార్చేయగల సత్తా హర్ధిక్ పాండ్య సొంతం. గత కొన్నాళ్లుగా జట్టు విజయాల్లో పాండ్య కీలక పాత్ర వహిస్తున్నాడు. దాంతో ఈ టి20 వరల్డ్ కప్ లో పాండ్య ప్రదర్శనపైనే అందరి చూపు ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి పాండ్య ఈసారి టి20 వరల్డ్ కప్ లో బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -