విరాట్ వర్కౌట్ వీడియోపై పీటర్సన్ పంచ్.. కోహ్లీ కౌంటర్..!

- Advertisement -

భారత జట్టు విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ గురించి ప్రెషల్ గా చెప్పనక్కర్లేదు. మ్యాచ్ లో అతని పరుగు చిరుతలా ఉంటుంది. ఎక్కువ సేపు జిమ్‌లో గడుపుతూ భారత ఆటగాళ్లందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటాడు కోహ్లీ. అయితే ఈ కరోనా టైంలో జిమ్ కు వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి ఫిట్ నెస్ కోసం ఇంట్లో కష్టపడుతున్నాడు.

అయితే గాల్లో ఎగురుతూ పుష్‌ అప్స్‌ చేసిన వీడియోను ఇటీవలే కోహ్లీ షేర్ చేశాడు. ఇంకో వీడియోలో పెద్ద సైజులో ఉన్న డుంబుల్స్ (వెయిట్‌లిఫ్టింగ్‌ పుషప్‌) ఎత్తి వర్కౌట్ చేసాడు. నేను రోజూ ఏదైనా ఎక్సర్‌సైజ్ చేయాలని అనుకుంటే అది ఇదే.. లవ్ ది పవర్ స్నాచ్’ అని ట్విట్టర్‌లో కాప్షన్ రాసుకొచ్చాడు కోహ్లీ. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన ఇంగ్లండ్ మాజీ కెఫ్టేన్, ప్రముఖ వ్యాఖ్యత కెవిన్ పీటర్సన్ సరదాగా సెటైర్ వేశాడు.

- Advertisement -

‘ఏయ్‌ కోహ్లీ .. బైక్‌పై వచ్చేయ్‌.. ఇద్దరం కలిసి చేద్దాం’ అని కామెంట్ చేసాడు. అందుకు కోహ్లీ పంచ్ ఇచ్చాడు. ‘రిటైర్మెంట్ తర్వాత తప్పకుండా వస్తా పీట‌ర్స‌న్’ అని కోహ్లీ బదులిచ్చాడు. వీరిద్దరి సంభాషణ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంది. విరాట్ కోహ్లీ భారత్ తరఫున 86 టెస్టులు, 248 వన్డేలు, 82 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి ఇప్పటికే 20 వేలకు పైగా రన్స్ బాదాడు.

కెరీర్ మొదట్లో ధోనీతో మాట్లాడేవాడిని కాదు : ఇషాంత్

రోహిత్ శర్మకి ఆసీస్ బౌలర్లతో సవాల్ తప్పదు : హస్సీ

గంభీర్, కోహ్లీ గొడవ గురించి చెప్పిన రజత్ భాటియా

ధోనీ ఇంకో 10ఏళ్లు క్రికెట్ ఆడుతాడు : హస్సీ

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...