ధోనీ ఇంకో 10ఏళ్లు క్రికెట్ ఆడుతాడు : హస్సీ

- Advertisement -

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఇంకో 10ఏళ్లు క్రికెట్ ఆడుతాడని ఆసీస్ మాజీ క్రికెటర్ మైకేల్ హస్సీ అన్నారు. 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత.. టీమిండియాకు దూరంగా ఉన్నాడు ధోనీ. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఫామ్ నిరూపించుకోవడం ద్వారా టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆశించాడు. కానీ ఇంతలో కరోనా ఎఫెక్ట్ వల్ల ఐపీఎల్ వాయిదాపడింది.

దాంతో ధోనీ కెరీర్ ప్రశ్నార్థంకలో పడిపోగా.. ఇక ధోనీ కెరీర్ ముగిసిందనే వాదనలు వస్తున్నాయి. అయితే ధోనీ భవితవ్యం గురించి తాజాగా మైకేల్ హస్సీ మాట్లాడుతూ ‘‘ధోనీ ఎవరి అంచనాలకి అందని వ్యక్తి. టీమిండియా తరఫునే కాదు.. చెన్నై సూపర్ కింగ్స్‌కి కూడా సుదీర్ఘకాలంగా అతను నిలకడగా ఆడుతున్నాడు. నా అంచనా ప్రకారం ధోనీ ఇంకో పదేళ్ళు ఆడుతాడు.

- Advertisement -

కానీ మనం చూడగలుగుతామా ? అన్నది నా సందేహం” అని వెల్లడించాడు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో భారత్ ఓటమికి ధోనీ రనౌట్ కారణమని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్‌లో ధోనీ కెప్టెన్సీలోనే మైకేల్ హస్సీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మ్యాచ్‌లు ఆడాడు. 2015లో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకీ రిటైర్మెంట్ ఇచ్చిన హస్సీ.. ఆ తర్వాత చెన్నై జట్టుకి బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు.

బుమ్రా నోబాల్‌ కారణంగా పాక్ తో భారత్‌ ఓడిపోయింది : భువనేశ్వర్

గంభీర్, కోహ్లీ గొడవ గురించి చెప్పిన రజత్ భాటియా

కోహ్లీని ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఎందుకు తీసుకోలేదో తెలుసా ?

కోహ్లీ కంటే రోహిత్ శర్మనే బెస్ట్ కెప్టెన్ : కృష్ణప్ప గౌతమ్

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...