ఇద్దరు స్టార్ క్రికెటర్లపై వేటు

- Advertisement -

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. యాషెస్ సిరీస్ లో 4-0 తేడాతో ఆస్ట్రేలియా చేలిలో ఘోర ఇంగ్లండ్ పరాజయం పాలైన నేపథ్యంలో ఈసీబీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.

గతంలో ఇంగ్లండ్ హెడ్ కోచ్ పై వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎవరూ ఊహించిన విధంగా ఇద్దరు దిగ్గజ ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ల అయిన అండర్సన్ , స్టువర్డ్ బ్రాడ్ లపై వేటు వేసింది. వెస్టిండీస్ తో జరిగే మూడు టెస్ట్ సిరీస్ కోసం వీరిని ఎంపిక చేయలేదు.

- Advertisement -

యాషెస్ సిరీస్ లో ఆడిన ఏడుగురు ఆటగాళ్లను విండీస్ సిరీస్ కు దూరంగా ఉంచింది. గత సిరీస్ లో వైఫల్యానికి కారణం బ్యాటర్లు కాగా బౌలర్లపై వేటు వేయడం గమనార్హం. ఇప్పటి వరకు అండర్సన్ 640 వికెట్లు సాధించాడు. స్టువర్డ్ బ్రాడ్ 537 వికెట్లు తీసి ఇంగ్లండ్ టీం లో అగ్రశ్రేణి బౌలర్లుగా కొనసాగుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -