338 ప‌రుగుల‌కు ఆస్ట్రేలియా ఆలౌట్!

- Advertisement -

బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదిక‌గా భారత్‌తో జ‌రుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. ఓవ‌ర్ నైట్ స్కోరు 166/2 తో ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా ఈ రోజూ అంత‌గా రాణించ‌లేక‌పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లో స్టీవ్ స్మిత్ 131, ల‌బుషేన్ 91, ప‌కోష్కీ 62 ప‌రుగులు చేశారు.

మార్కస్ లబుషేన్ (91: 196 బంతుల్లో 11×4) , మాథ్యూ వేడ్‌( 13;2 ఫోర్స్), గ్రీన్ (0: 21 బంతుల్లో), పైనే(1) ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అన్న‌ట్టుగా పెవీలియ‌న్ బాట ప‌ట్టారు. స్టార్క్ ( 24; 2 ఫోర్స్, 1 సిక్స్‌) కాసేపు మెరుపులు మెరిపించాడు.

- Advertisement -

ఇదిలా ఉంటే చివర్లో స్మిత్ తన బ్యాట్ తో రెచ్చిపోయాడు.. సెంచరీతో ఆకట్టుకున్నాడు. జ‌డేజా అద్భుత‌మైన త్రో వ‌ల‌న స్మిత్ ర‌నౌట్‌గా వెనుదిర‌గ‌డంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు తెర‌ప‌డింది.  భార‌త బౌల‌ర్స్‌లో రవీంద్ర జ‌డేజా నాలుగు వికెట్స్ తీయ‌గా.. జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ రెండు వికెట్స్‌.. మొహ్మద్ సిరాజ్‌ ఓ వికెట్ ద‌క్కించుకున్నారు.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...