Monday, May 6, 2024
- Advertisement -

వార్న‌ర్‌, స్మిత్‌పై ఏడాదిపాటు వేటు వేషిన సీఏ…

- Advertisement -

అంద‌రూ అనుకున్న‌ట్లుగానే బాల్ ట్యాంప‌రింగ్ వివాదంలో వార్న‌ర్‌, స్మిత్‌పై వేటు ప‌డింది. ఈ వ్యవహారంలో సీఏ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో వారిపై కఠినచర్యలే తీసుకుంది. స్మిత్‌, వార్నర్‌పై ఏడాది నిషేధం, బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధాన్ని విధించింది దీంతో వీరు ఈ ఏడాది ఐపీఎల్‌కి కూడా దూరమైనట్లుగానే తెలుస్తోంది.

తాను విధించిన శిక్షలపై అప్పీలుకు సీఏ వారికి వారం రోజుల గడువు ఇచ్చిది. ట్యాంపరింగ్ ఉదంతానికి ఈ ముగ్గురే కారకులంటూ క్రికెట్ ఆస్ట్రేలియా ఈ మేరకు శిక్షలు ఖరారు చేయడం గమనార్హం. మరోవైపు బాల్ ట్యాంపరింగ్ ఉదంతం నేపథ్యంలో స్టీవ్ స్మిత్‌ను ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ, డేవిడ్ వార్నర్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాయి. సీఏ తాజా నిర్ణయంతో మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ టోర్నీలో వారిద్దరూ ఆడతారా?లేదా? అన్నది సందేహంగా మారింది. బీసీసీఐతో సంబంధిత ఫ్రాంచైజీలు చర్చలు జరిపిన తర్వాతే దీనిపై ఓ క్లారిటీ వస్తుంది.

కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బంతి రివర్స్‌ స్వింగ్‌ అయ్యేందుకు బాన్‌క్రాఫ్ట్‌ పసుపు రంగు టేపుతో బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తూ కెమెరా చేతికి చిక్కాడు. మైదానంలోని తెరపై ఇందుకు సంబంధించిన దృశ్యాలను చూపించగానే అప్రమత్తమైన బాన్‌క్రాఫ్ట్‌ దాన్ని ప్యాంటులో వేసుకుంటూ కనిపించాడు. బాల్‌ టాంపరింగ్‌ జరిగిందని తేలడంతో వెంటనే ఐసీసీ, క్రికెట్‌ ఆస్ట్రేలియా విచారణ ప్రారంభించింది.

స్మిత్‌పై ఒక మ్యాచ్‌ నిషేధంతో పాటు వంద శాతం మ్యాచ్‌ ఫీజులో కోత విధించిన ఐసీసీ బాన్‌క్రాఫ్ట్ మ్యాచ్ ఫీజులో 75 శాతం జరిమానా విధించింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా విచారణలో ఈ ముగ్గురు దోషులుగా తేలడంతో స్మిత్‌, వార్నర్‌పై 12 నెలలు, బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించినట్లు తాజాగా ప్రకటించిం.

అంతేకాకుండా.. స్మిత్, వార్నర్‌లను ఆసీస్ కెప్టెన్, వైస్ కెప్టెన్‌ల బాధ్యతల నుంచి కూడా తప్పించింది. ఐపీఎల్‌లోనూ రాజస్థాన్ రాయల్స్ (స్మిత్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (వార్నర్) నాయకత్వ బాధ్యతల్ని ఈ ఇద్దరూ వదులుకున్నారు. తాజా నిషేధంతో వీరిద్దరూ ఐపీఎల్‌కి కూడా దూరంకానున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -