ప్రపంచకప్ ముంగిట టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా ప్రధాన బ్యాట్స్‌మెన్‌లలో ఒకడైన గిల్ డెంగీ జ్వరంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆసీస్ మ్యాచ్‌కు దూరమైన గిల్…తర్వాత మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. ప్లేట్ లేట్ కౌంట్ తక్కువగా ఉండటంతో గిల్‌ను ముందుజాగ్రత్త చర్యగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చినట్లు సమాచారం. గిల్ గైర్హాజరి ఎఫెక్ట్ ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది.
ఇక గిల్ బుధవారం భారత్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించగా తాజాగా ఆస్పత్రిలో చేరడంతో దాయాదుల పోరుకు దూరం కానున్నాడు. ఇది భారత క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకే.
ఎందుకంటే ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యమే అయినా కేవలం 2 పరుగులకే 3 కీలక వికెట్లు కొల్పోవడం అందరిని కలవరానికి గురి చేసింది. కోహ్లీ, రాహుల్ రాణించారు కాబట్టి సరిపోయింది లేకపోతే టీమిండియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకునేదే. అందుకే ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్, ఇషాన్, శ్రేయాస్ రాణించాలని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు.
