Wednesday, April 24, 2024
- Advertisement -

భారత్ కు నిరాశ.. క్లారిటీ ఇచ్చిన రోహిత్ !

- Advertisement -

వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు బ్రేక్ పడింది. బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన మూడవ టి20 మ్యాచ్ లో టీమిండియా ఓటమి చవి చూసింది. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో వరుసగా రెండు విజయాలు సాధించి సిరీస్ కైవసం చేసుకున్నా టీమిండియా మూడవ విజయం కూడా సాధించి ఇంగ్లీష్ జట్టును క్లీన్ స్వీప్ చేయాలని భావించి నిరాశ కు గురైంది. కానీ ఇంగ్లాండ్ జట్టు మూడవ మ్యాచ్ లో విజయం సాధించి క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకొని స్వదేశంలో పరువు నిలుపుకుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 20 ఓవర్లలో 198 పరుగులు చేసి విజయనికి కొద్ది దూరంలో నిలిచి, ఓటమి చవి చూసింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలు అయినప్పటికి టీమిండియా యువ బ్యాట్స్ మెన్ సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ క్రికెట్ అభిమానులను అలరించింది. సూర్య కుమార్ 55 బంతుల్లో 117 పరుగులతో ( 14 ఫోర్లు, 6 సిక్సర్లు ) మెరుపు సెంచరీ చేసి ఒకానొక టైమ్ లో టీమిండియా ను విజయనికి చేరువ చేశాడు కానీ, అతనికి సరైన సహకారం లభించక పోవడంతో రోహిత్ సేన ఓటమి ముంగిట నిలవాల్సివచ్చింది. ఈ మ్యాచ్ ఓటమితో రోహిత్ కెప్టెన్సీ లో వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్న టీమిండియా కు బ్రేక్ పడింది.

ఇక ఈ మ్యాచ్ ఓటమి పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చారు. ఇంగ్లాండ్ జట్టు భారీ లక్ష్యాన్ని తమ ముందు ఉంచి తమ జట్టును ఒత్తిడిలోకి నేట్టిందని, దాంతో ఒత్తిడిని అధిగమించలేక విజయాన్ని అందుకోలేకపోయామని రోహిత్ అన్నాడు. అయితే ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ చక్కటి ప్రదర్శన కనబరిచడాని, అతని ఆటతీరు అమోఘం అంటూ రోహిత్ శర్మ అభినంధించాడు. ఇక ఈ ఓటమి ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని, ముఖ్యంగా భౌలింగ్ విభాగం లో రిజర్వు బెంచ్ బలం తెలిసిందని, ఇక రాబోయే ప్రతి మ్యాచ్ లోనూ మెరుగ్గా అడటమే తమ లక్ష్యమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చారు.

Also Read : కింగ్ కోహ్లీ కి గడ్డుకాలం .. ఇక కష్టమే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -