Friday, April 26, 2024
- Advertisement -

కింగ్ కోహ్లీ కి గడ్డుకాలం .. ఇక కష్టమే ?

- Advertisement -

ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఎంతోమంది లెజెండరీ క్రికెటర్స్ ఉన్నప్పటికి విరాట్ కోహ్లీ స్థానం చాలా ప్రత్యేకం. గ్రౌండ్ లో అగ్రేస్సివ్ అట్టిట్యూడ్ తో .. జట్టు ఏదైనా పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు కంటి మీద కునుకు లేకుండా చేసేవాడు..వన్డేలు, టెస్టులు, టి20 లు .. ఇలా ఫార్మెట్ ఏదైనా సరే తనదైన ఆటతీరుతో వరల్డ్ నెంబర్ ఒన్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు. సెంచరీల పరంగాను, హాఫ్ సెంచరీల పరంగాను ఎన్నో రికార్డులు కోహ్లీ పేరు మీద ఉన్నాయి. కానీ ఇవ్వన్ని ఒక్కప్పటి మాట.. ప్రస్తుతం కోహ్లీ క్రీజ్ లో నిలదొక్కుకునేందుకే నానా తంటాలు పడుతున్నాడు. గత రెండేళ్లుగా ఫామ్ కోల్పోయే ఇబ్బంది పడుతున్న కోహ్లీ ట్రాక్ రికార్డ్ చూస్తే.. అసలు ఒకప్పటి కోహ్లీ యేనా ? అనే అనుమానాలు రాక మానవు..

గత రెండేళ్ల కాలంలో వన్డే, టి20, టెస్టు సిరీస్ ఇలా అన్నిటిలోనూ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో కూడా కోహ్లీ పెద్దగా రాణించలేకపోయాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో 16 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ తన కెరియర్ లో ఎన్నడూ లేని విధంగా 22.73 సగటు తో కేవలం 340 పరుగులు మాత్రమే చేశాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు కోహ్లీ ఎంత దారుణంగా విఫలం అవుతున్నాడనే విషయం. అయితే ఎప్పటికైనా విరాట్ తిరిగి ఫామ్ లోకి వస్తాడు అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఎప్పటికప్పుడు నిరాశే ఎదురౌతుంది. ఇక తాజాగా ఇంగ్లండ్ తో జరుగుతున్నా టి20 సిరీస్ లో కూడా కోహ్లీ ప్రదర్శన అసంతృప్తిగానే ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా జట్టులో కోహ్లీ స్థానంపైనే అనుమానాలు ఏర్పడుతున్నాయి. కోహ్లీ తిరిగి ఫామ్ లోకి రాకపోతే రాబోయే టి20 ప్రపంచ కప్ లో స్థానం దక్కడం కష్టమే అనే వ్యాఖ్యలు కూడా మాజీల నుంచి వినిపిస్తున్నాయి.

ఎందుకంటే రాబోయే టి20 ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకొని యువ ఆటగాళ్లు.. దీపక్ హుడా, హర్ధిక్ పాండ్య, ఇషన్ కిషన్, దినేష్ కార్తీక్ వంటి వారు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని సత్తా చాటుతున్నారు. కానీ కోహ్లీ మాత్రం ఇంకా ఫామ్ లేమి తో ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. కోహ్లీ రెండేళ్ళు గడుస్తున్న తిరిగి మునుపటి ఫామ్ లోకి రాకపోవడానికి మానసిక సమస్యలే కారణం అంటూ క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా తనను కెప్టెన్సీ నుంచి తప్పించే విషయంలో బీసీసీఐ విధానంపై కోహ్లీ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడని, అప్పటినుంచి మానసికంగా బలం పుంజుకోలేకపోతున్నాడనేది విశ్లేషకులు చెబుతున్నా మాట. ఏది ఏమైనప్పటికి కింగ్ కోహ్లీ ఇప్పటికీ కూడా తిరిగి ఫామ్ లోకి రాకపోతే రాబోయే టి20 వరల్డ్ కప్ లో కోహ్లీ ని చూడడం కష్టమే అనే వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. మరి కోహ్లీ తన మునుపటి ఫామ్ లోకి ఎప్పుడు వస్తాడో చూడాలి.

Also Read : టీమిండియా దూకుడు.. రోహిత్ రికార్డ్ ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -