Monday, May 6, 2024
- Advertisement -

భార‌త ఆట‌గాళ్లు స‌త్తా చాటేనా.. నేటి నుంచి కామ‌న్వెల్త్ క్రీడోత్స‌వాలు

- Advertisement -

ఒలంపిక్స్ అంత్య‌త ప్రాచుర్యం పొందిన క్రీడోత్స‌వాలు కామన్వెల్త్ గేమ్స్‌. 1930నుంచి ప్రారంభ‌మైన ఈ కామ‌న్వెల్త్ గేమ్స్ రెండు మూడుసార్లు నిర్వ‌హించ‌లేదు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా ఈ క్రీడోత్స‌వాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ క్రీడోత్స‌వాల్లో 71 దేశాల నుంచి 6 వేలకు పైగా ఆట‌గాళ్లు ప‌త‌కాల వేట మొద‌లుపెట్ట‌నున్నారు.

ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌ వేదికగా 21వ కామన్వెల్త్ గేమ్స్ బుధవారం (ఏప్రిల్ 4) ప్రారంభం కానున్నాయి. నేడు క్రీడోత్స‌వాల ప్రారంభోత్స‌వం జ‌ర‌గ్గా గురువారం (ఏప్రిల్ 5) నుంచి అస‌లైన పోటీలు మొదలవుతాయి. కరారా స్టేడియంలో పీవీ సింధు పతాకంతోఆరంభ వేడుకల్లో మువ్వన్నెల జెండాతో మన బృందాన్ని ముందుండి నడిపించనుంది. ఏప్రిల్ 15వ తేదీ వరకూ 11 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయి. ఈ మెగా ఈవెంట్‌లో భారత‌దేశం నుంచి ఈసారి 219 మంది ఆట‌గాళ్లు పోటీ ప‌డుతున్నారు.

గత కామ‌న్వెల్త్ క్రీడల్లో భారత్‌ 15 స్వర్ణాలు సహా 64 పతకాలు గెలుచుకుని ప‌త‌కాల సాధ‌న‌లో ముందు ఉంది. ది. అంతకుముందు 2010లో భార‌త్‌లోని ఢిల్లీలో జరిగిన క్రీడోత్స‌వాల్లో 100 ప‌త‌కాలు కొట్టి అత్యుత్తమంగా రెండో స్థానం దక్కించుకుంది. ఈ క్రీడోత్స‌వాల్లో భార‌త్ టాప్ 5లో చోటుసంపాదించుకుంటూ వస్తోంది.

మ‌రీ ఈసారి కూడా దాన్ని కాపాడుకోవాల‌నే త‌ప‌న‌తో ఆట‌గాళ్లు ప‌య‌న‌మ‌య్యారు. మ‌రీ ఎన్ని ప‌త‌కాల‌తో భార‌త ఆట‌గాళ్లు తిరిగి వ‌స్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -