Monday, May 13, 2024
- Advertisement -

యాషెస్ సిరీస్ అని ఆపేరు ఎలా వ‌చ్చిందో తెలుసా….?

- Advertisement -

యాషెస్ సిరీస్ పేరు వింటేనే క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ‌. టెస్టు క్రికెట్‌లో చ రిత్ర‌లోనె అతిపెద్ద సంగ్రామంగా భావిస్తారు. ఒక ర‌కంగా చెప్పాలంటె మ‌హాభార‌త సంగ్రామం లాంటిది. ఈ సిరీస్ పేరు వింటేనె అభిమానుల రోమాలు నిక్క‌పొడుచుకుంటాయి. భార‌త్‌, పాక్ మ్యాచ్ ఎలానో….ఇంగ్లాండ్‌-ఆస్ట్రేలియా మ‌ద్య యాషెస్ సిరీస్ టెస్ట్ అలాంటిది.

క్రికెట్ గురించి తెలియని చాలా మంది యాషెస్ అంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే సిరీస్‌ టెస్టు సిరిస్‌గా భావిస్తారు. కానీ ఆ రెండు దేశాలకు చెందిన అభిమానులు మాత్రం ఈ సిరిస్‌ను ఓ యుద్ధంలా చూస్తారు.

ఈ సిరీస్‌ను రెండు దేశాలు ప్ర‌తీష్టాత్మ‌కంగా తీసుకుంటాయి. ప్రతి రెండేళ్లకొకసారి జరిగే ఈ మహా సంగ్రామం నవంబర్ 23 (గురువారం) బ్రిస్బేనే వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ప్రారంభం కానుంది. చాలా మందికి యాషెస్ చరిత్ర తెలియదు. నిజం చెప్పాలంటే ఈ సిరీస్‌కు యాషెస్ అనే పేరు కాడా చాలా చిత్రంగా వచ్చింది. దీని వెనుక ఓ ఆసక్తికరమైన స్టోరీ ఉంది.

క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు క్రికెట్‌ తొలినాళ్లలో ఇంగ్లాండ్‌దే ఆధిపత్యం. అయితే 1882లో అంటే సరిగ్గా 135 ఏళ్ల కిందట ఇంగ్లాండ్ ఆధిపత్యానికి ఆసీస్ అడ్డుకట్ట వేసింది. ఆ ఏడాది ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియా.. వాళ్లను సొంతగడ్డపైనే ఓడించింది. సిరీస్ ఓడిపోవ‌డంతో శరీరాన్ని కాల్చి బూడిదను ఆస్ట్రేలియాకు తీసుకెళ్లారని టైమ్స్ పత్రిక అప్పట్లో పెద్దఎత్తున వార్తాకథనాన్ని రాసింది. ఆ తర్వాత అదే ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ కెప్టెన్ బ్లిగ్.. ఆ బూడిదతోపాటు ఇంగ్లిష్ క్రికెట్ గౌరవాన్ని కూడా తిరిగి తీసుకొస్తానని ప్రతిజ్ఞ చేశాడు.

1882-83లో రూపర్ట్‌వుడ్స్ మాన్షన్‌లో జరిగిన ఓ ప్రెండ్లీ మ్యాచ్‌లో అక్కడి మహిళల బృందం ఓ చిన్న కప్పులో ఆ బూడిదను వేసి ఇచ్చారు. ఆ బూడిద ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయిన మ్యాచ్‌లో స్టంప్స్‌పై వాడిన ఓ బెయిల్‌ది అని చెబుతుంటారు. ఇలా ఆ ఘటన ఓ పెద్ద ‘బూడిద’ సంగ్రామానికి దారి తీసింది.

మ్యాచ్‌కు ముందే ఇరు జ‌ట్ల ఆట‌గాల్లు మాట‌ల యుద్ధానికి దిగుతారు. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌‌ ఫలితాన్ని తొలి టెస్టు నిర్దేశిస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తొలి టెస్టు జరిగే గబ్బా స్టేడియంలో గత 31 ఏళ్లుగా ఆసీస్ ఓటమనేది ఎరుగలేదు. ఈ రికార్డును కొనసాగించడం ఆస్ట్రేలియాకు ఎంతో కీలకంగా మారింది. తొలిటెస్టులో ఇంగ్లాండ్ గెలిస్తే మాత్రం ఆసీస్‌ సిరీస్‌ మీద ఆశలు వదులుకోవాల్సిందేనని విశ్లేషకులు అంటున్నారు. ఇది యాషెస్ సిరీస్ చ‌రిత్ర‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -