Saturday, April 20, 2024
- Advertisement -

ధోనీ అవసరం ఉంది.. కానీ అది కోహ్లీ చేతిలోనే ఉంది : సురేశ్ రైనా

- Advertisement -

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతుల్లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కెరీర్ ఉందని బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. మోకాలి గాయంకు సర్జరీ చేయించుకుని క్రికెట్ కు దూరమైన రైనా.. తాజాగా ఫిట్‌నెస్ సాధించేందుకు శ్రమిస్తున్నాడు. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో ఆడటమే తన లక్షమని అన్నారు.

అలానే మహేంద్రసింగ్ ధోనీ కెరీర్ గురించి స్పందించాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ ట్రైనర్ గ్రేమ్ కింగ్ పర్యవేక్షణలో ప్రస్తుతం ఫిట్‌నెస్ సాధించేందుకు శ్రమిస్తున్న సురేశ్ రైనా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ’ఐపీఎల్ 2020లో మంచి ప్రదర్శన కనబర్చాలని ఆశిస్తున్నా. మరో 2-3 ఏళ్లు క్రికెట్ ఆడగలను. ఐపీఎల్‌లో మెరుగ్గా రాణించగలిగితే..? అక్టోబరులో జరిగే టీ20 వరల్డ్‌కప్ రేసులో నేనూ నిలవొచ్చు. అలానే ధోనీ కూడా ఐపీఎల్ కోసం మార్చిలో ప్రాక్టీస్ సెషన్స్‌కి హాజరుకానున్నాడు.

ఇక టీమిండియలోకి ధోనీ రీ ఎంట్రీ అనేది కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయంపై ఆధారపడి ఉంది. భారత జట్టుకి అతని సేవలు అవసరం. 2018, జులైలో భారత్ తరఫున ఆఖరిగా టీ20ల్లో ఆడిన సురేశ్ రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా టీమ్‌లో చోటు కోల్పోయాడు. గత ఏడాది నెం.4 కోసం రైనా పేరుని కూడా టీమిండియా మేనేజ్‌మెంట్ పరిశీలించింది. కానీ.. గాయం కారణంగా అతను రేసు నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2020లో మంచి ప్రదర్శన కనబర్చి మళ్లీ రేసులో ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -