Sunday, May 5, 2024
- Advertisement -

టీమిండియా కొత్త ఆరెంజ్ జెర్సీపై సోష‌ల్ మీడియాలో పేలుతున్న జోకులు

- Advertisement -

ఐసీపీ వరల్డ్ కప్‌లో భాగంగా రేపు (ఆదివారం) ఇంగ్లండ్‌తో తలపబడోతున్న టీమిండియా… ఆరెంజ్ రంగు జెర్సీతో బ‌రిలోకి దిగుతోంది. కొత్త జెర్సీలను శుక్రవారం రోజు అధికారికంగా విడుదల చేశారు. ఈ జెర్సీపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఆ జెర్సీ బ్లూ, ఆరెంజ్ రంగుల మిళితంతో చూడముచ్చటగా ఉందనే ప్రశంసలు ఓవైపు వినిపిస్తోండగా.. సోషల్ మీడియాలో వీటిపై జోకులు పేలుతున్నాయి.

ఐసీసీ నిబంధనల ప్రకారం రెండు జట్లు ఒకే రంగు జెర్సీలను ధరించడానికి వీల్లేదు. దీంతో ఆతిథ్య ఇంగ్లండ్ బ్లూ జెర్సీనే ధరిస్తుండగా.. భారత్ మాత్రం వేరే రంగు జెర్సీని ధరించాల్సి ఉంది. దీనిలో భాగంగా బీసీసీఐ కోరిక మేరకు టీమిండియాకు ఆరెంజ్ రంగు జెర్సీని కేటాయించింది ఐసీసీ. , కొత్త జెర్సీలను ధరించిన కోహ్లీసేన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. ఈ జెర్సీపై సోష‌ల్ మీడియాలో నెట‌జ‌న్లు పన్నీ జోకులు పేలుస్తున్నారు.

స్విగ్గీ స్పూర్తితో అవే జెర్సీని డిజైన్‌ చేసినందుకు దానికి తప్పకుండా క్రెడిట్‌ ఇవ్వాలని ఒకరు.. అచ్చం హార్లిక్స్‌ డబ్బాలానే ఉందని మరొకరు కామెంట్‌ చేస్తున్నారు. ఇంకొందరు భారత్‌ అవే జెర్సీ బాగుందని, మొత్తం దీన్నే కొనసాగించాలంటున్నారు. మరోవైపు ఇవి మున్సిపల్ సిబ్బంది వేసుకున్న తరహాలో ఉన్నాయనే సెటైర్లు వేస్తున్నారు.

ఇప్పటికే ఈ జెర్సీ రంగుపై రాజకీయంగా దుమారం రేగింది. టీమిండియా ఆరెంజ్‌ జెర్సీ ధరించడం వెనుక మోదీ ప్రభుత్వ ఒత్తిడి ఉందని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. భాజాపా కూడా ఆ విమ‌ర్శ‌ల‌కు ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -