Friday, May 3, 2024
- Advertisement -

రిష‌బ్‌పంత్‌పై నోరు పారేసుకున్న స్టువ‌ర్ట్ బ్రాడ్‌కు షాక్ ఇచ్చిన ఐసీసీ..

- Advertisement -

ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌పైఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడమే కాకుండా డీమెరిట్ పాయింట్స్ కలిపింది. భారత్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో బ్రాడ్‌ నిబంధనలు అతిక్రమించినట్లు ఐసీసీ అధికారులు గుర్తించారు.

ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య మూడో టెస్టు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రెండో రోజు ఆటలో 92వ ఓవర్లో బ్రాడ్‌ వేసిన బంతికి అరంగేట్ర ఆటగాడు రిషబ్‌ పంత్‌ ఔటయ్యాడు. పంత్‌ క్రీజును వదిలి పెవిలియన్‌కు వెళ్లే సమయంలో బ్రాడ్‌ అతని వైపు చూస్తూ ఏవో వ్యాఖ్యలు చేశాడు. ఇదంతా కెమెరాలో రికార్డయ్యింది. గమనించిన ఐసీసీ అధికారులు దీనిపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. బ్రాడ్‌ను పిలిచి ప్రశ్నించగా తాను వ్యాఖ్యలు చేసినట్లు ఒప్పుకున్నాడు. బ్రాడ్ నేరాన్ని అంగీకరించడంతో మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధిస్తున్నట్లు వారు తెలిపారు.

తొలి రెండు టెస్టులో ఓడిపోయి ఐదు టెస్టుల సిరీస్‌లో 0-2తో వెనకబడిన భారత్.. మూడో టెస్టులో పట్టుబిగించింది. భారత్ విజయానికి మరొక్క వికెట్ మాత్రమే అవసరం కాగా, రోజంతా సమయం ఉంది. దీంతో భారత్ గెలుపు ఖాయమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -