Friday, March 29, 2024
- Advertisement -

ఆసిస్ గ‌డ్డ‌పై చ‌రిత్ర సృష్టించిన భార‌త్‌…

- Advertisement -

కంగారూల గ‌డ్డ‌పై భారత క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్ర అధ్యాయాన్ని లిఖించింది. 72 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకి చారిత్రక గెలుపుతో కోహ్లీసేన ఈరోజు తెరదించింది. నాలుగుటెస్ట్‌ల సిరీస్ 2-1 తో గెలిచి ఏఇండియా కెప్టెన్‌కు సాధ్యంకాని చ‌రిత్ర‌ను నెల‌కొల్పారు. ఈ మ్యాచ్‌లో అద్భుత సెంచరీ సాధించడంతో పాటు సిరీస్ ఆసాంతం రాణించిన పుజారాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని కోహ్లీ సేన ముద్దాడి విదేశీగడ్డపై సత్తా చాటింది. గతంలో 1980-81, 1985-86, 2003-04 పర్యటనల్లో భారత్‌ సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో భారత్‌కు 7 విజయాలు దక్కాయి. నాలుగో మ్యాచ్‌లో విజ‌యం సాధించేందుకు భార‌త్‌కు అవ‌కాశాలు ఉన్నా ఇద్ద‌రిపై వ‌రణుడు పైచేయి సాధించారు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 622/7 డిక్లేర్‌ చేయగా, ఆసీస్‌ తన మొదటి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు.. కుల్దీప్ యాదవ్ (5/99) ధాటికి 300 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిపోగా.. భారత్‌కి 322 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత కంగారూల టీమ్‌ని కెప్టెన్ కోహ్లీ ఫాలో ఆన్ ఆడించగా నిన్న వెలుతురులేమి కారణంగా ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 6/0తో నిలిచింది. ఎంత సేప‌టికి వ‌ర్షం త‌గ్గ‌క పోవ‌డ‌తో టెస్ట్‌ను డ్రాగా ప్ర‌క‌టించారు అంపైర్లు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ -662/7 డిక్లేర్డ్‌
ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ – 300
ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ – 6/0

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -