Sunday, May 5, 2024
- Advertisement -

కోహ్లీపై ప్ర‌శంశ‌లు కురిపించిన పాకిస్థాన్ మాజీ స్టార్ బౌల‌ర్‌….

- Advertisement -

తనలోని అసాధారణమైన ప్రతిభను మరోసారి చూపెట్టిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ (225 బంతుల్లో 149; 22 ఫోర్లు, 1 సిక్స్) ఇంగ్లండ్ గడ్డపై తొలి సెంచరీతో చెలరేగిపోయాడు. సహచరులందరూ నిరాశపర్చినా.. ప్రత్యర్థులు వికెట్ల పండుగ చేసుకున్నా.. తాను మాత్రం ఒంటరిగా స్ఫూర్తిదాయక పోరాటం చేశాడు. ఫలితంగా గురువారం రెండో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 76 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌కు 13 పరుగుల ఆధిక్యం లభించింది.

ఈ నేపథ్యంలో కోహ్లీని ఆకాశానికెత్తేశాడు పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అఖ్తర్. “అద్భుతమైన సెంచరీ. చివరిసారి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినప్పుడు కోహ్లీ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. కానీ ఈ సారి మాత్రం తాను ఎంత గొప్ప ఆటగాడో నిరూపించుకున్నాడు. అతని పట్టుదల, అంకితభావం చాలా గొప్పవి. ఈ టూర్ లో కూడా రాణించలేడంటూ అతనిపై వచ్చిన కామెంట్లకు సరైన సమాధానం చెప్పాడంటూ ప్ర‌శంశ‌ల వ‌ర్షం కురిపించారు.

నన్ను అమితంగా ఆకట్టుకున్నది ఏమిటంటే… టాప్ ఆర్డర్ తో కలసి ఆడుతున్నప్పుడు ఎంత స్ట్రైక్ రేట్ మెయింటెయిన్ చేస్తాడో… లోయర్ ఆర్డర్ తో కలసి ఆడుతున్నప్పుడు కూడా అదే స్టైక్ రేట్ మెయింటెయిన్ చేయడం. ఇది సాధారణ విషయం కాదు. ప్రపంచ బ్యాట్స్ మెన్లు అందరికీ కోహ్లీ ఒక బెంచ్ మార్క్” అంటూ ట్వీట్ చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -