Saturday, April 20, 2024
- Advertisement -

ఎటువంటి మార్పుల్లేకుండా నాలుగో టెస్ట్ బ‌రిలోకి దిగుతున్న టీమిండియా..

- Advertisement -

ఇంగ్లండుతో జ‌ర‌గ‌నున్న నాలుగో టెస్ట్ టీమిండియాకు డూ ఆర్ డై లాంటిది. టెస్ట్ సిరీస్ గెల‌వాన్నా, ఓడిపోకుండా ఉండాల‌న్నా ఈ టెస్ట్‌లో త‌ప్కక గెల‌వాల్సిందే. మొద‌టి రెండు టెస్టుల్లో ఓడిపోయిన కోహ్లీసేన మూడో టెస్ట్‌లో పుంజుకొని అనూహ్యంగా ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో….అదే ఊపుతో నాలుగో టెస్ట్‌పై క‌న్నేసింది టీమిండియా.

నాలుగో టెస్ట్‌కు టీమిండియాలో ఎటువంటి మార్పులు చేయ‌లేద‌ని కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపారు. భారత జట్టులో ప్రస్తుతం అందరూ ఫిట్‌గా ఉన్నారు. గాయపడిన అశ్విన్‌.. పూర్తిగా కోలుకున్నాడు. అతను ప్రాక్టీస్ సెషన్‌లోనూ చురుగ్గా కనిపించాడు. తుది జట్టులో తరచూ మార్పులు చేయాలని నేను ఆశించను. కానీ.. గాయాల కారణంగా ఇప్పటి వరకు కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింద‌న్నారు.

నాలుగో టెస్టు గెలవడానికి వ్యూహాలు రచించాం. వరుసగా రెండు టెస్టుల ఓటమి అనంతరం మూడో టెస్టు గెలవడానికి చాలా కష్టపడ్డాం. అయితే నాటింగ్‌హామ్‌లో కష్టపడినదానికంటే ఇంకాస్త ఎక్కువ కష్టపడితే సౌతాంప్టన్‌లోనూ గెలిచి సిరీస్‌ సమం చేస్తాం. నాకు పూర్తి నమ్మకం ఉంది. నాలుగో టెస్టులో గెలిచి తీరుతాం అంటూ కోహ్లీ ఆత్మ‌విశ్వాసం వ్య‌క్తం చేస్తున్నారు.

జస్ప్రిత్‌ బుమ్రా, ఇషాంత్‌ శర్మలు జట్టులో ఖాయంగా కనిపిస్తున్నారు. కోహ్లి అనుమానం మ్యాచ్‌ జరిగే కొద్ది పిచ్‌ స్పిన్నర్లుకు అనుకూలించే అవకాశం ఉండటంతో షమీ స్థానంలో రవీంద్ర జడేజా వచ్చే అవకాశం ఉంది. అశ్విన్‌ ఫిట్‌నెస్‌పై సందేహాలు అక్కర్లేదని కోహ్లి స్పష్టంచేశాడు. నాలుగో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ని 2-2తో సమం చేయాలని ఆశిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -