Thursday, April 25, 2024
- Advertisement -

తొలి టీ20లో న్యూజిలాండ్ చేతిలో ఘోర‌ప‌రాజ‌యం చెందిన రోహిత్ సేన‌..

- Advertisement -

మూడు టీ 20 సిరీస్‌లో భాగంగా వెస్ట్ ప్యాక్ స్టేడియంలో జ‌రుగుతున్న మొద‌టి టీ20లో భార‌త్ చిత్తుచిత్తుగా ఓడింది. న్యూజిలాండ్ బ్య‌ట్స్‌మెన్‌ల జోరుకు భార‌త బౌల‌ర్లు విల‌విల్లాడిపోయారు. మొద‌ట టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకుంది భార‌త్‌. బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్నీత ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 219ప‌రుగులు చేసింది.

220 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. సౌతీ వేసిన మూడో ఓవర్ రెండో బంతికి ఓపెనర్ రోహిత్ శర్మ(1) లాకీ పెర్గుసన్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బౌలింగ్‌, బ్యాటింగ్ రెండిటిలోనూ టీమిండియా ఘోరంగా విఫలం అయ్యింది. కీవీస్ బౌల‌ర్ల ధాటికి భార‌త్ 19.2 ఓవర్లలోనే 139 పరుగులకి ఆలౌటైంది.

రోహిత్ అవుట్ అయిన వెంట‌నే శిఖర్ ధావన్ (29: 18 బంతుల్లో 2×4, 3×6), విజయ్ శంకర్ (27: 18 బంతుల్లో 2×4, 2×6) కీలక సమయంలో వికెట్లు చేజార్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ (4: 10 బంతుల్లో), దినేశ్ కార్తీక్ (5: 6 బంతుల్లో), హార్దిక్ పాండ్య (4: 4 బంతుల్లో 1×4) తేలిపోవడంతో 11 ఓవర్లు ముగిసే సమయానికి 77/6తో భారత్ ఓటమి ఖాయమైంది. ఆఖర్లో మహేంద్రసింగ్ ధోని (39: 31 బంతుల్లో 5×4, 1×6), కృనాల్ పాండ్య (20: 18 బంతుల్లో 1×4, 1×6) కాసేపు క్రీజులో నిలిచి టీమిండియా పరువు నిలిపే ప్రయత్నం చేశారు.

మోద‌ట బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఓపెన‌ర్లు మంచి శుభారంభం ఇచ్చారు. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే కొలిన్ మున్రో (34: 20 బంతుల్లో 2×4, 2×6) ఫోర్, సిక్స్‌తో ఆ జట్టులో ఉత్సాహం నింపారు. తొలి వికెట్‌కి 8.1 ఓవర్లలోనే 86 పరుగుల భాగస్వామ్యం న్యూజిలాండ్‌కి లభించింది. అయితే.. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో కృనాల్ పాండ్య విడదీశాడు.

అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్స్‌సన్‌తో జతకలిసిన సిఫర్ట్ బౌండరీలతో చెలరేగిపోయాడు. సిఫర్ట్… 42 బంతుల్లో 6 సిక్సర్లు, 7 ఫోర్లతో 84 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత బౌండరీ దగ్గర అద్భుత క్యాచ్‌తో మిచెల్‌ను అవుట్ చేశాడు దినేశ్ కార్తీక్. ఆ తర్వాతి ఓవర్‌లోనే కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ 22 బంతుల్లో 3 సిక్సర్లతో 34 పరుగులు చేసి చాహాల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆఖర్లో రాస్ టేలర్ (23: 14 బంతుల్లో 2×6), స్కాట్ (20 నాటౌట్: 7 బంతుల్లో 3×4, 1×6) బ్యాట్ ఝళిపించి న్యూజిలాండ్‌కి 219 స్కోరు అందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -