Saturday, May 4, 2024
- Advertisement -

కివీస్ పేసర్ల దెబ్బకి క‌ష్టాల్లో టీమిండియా….

- Advertisement -

ప్రపంచకప్‌ నేపథ్యంలో ఓవల్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. కీవీస్ పేస‌ర్ల దెబ్బ‌కి 6 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. 20 ఓవ‌ర్లు పూర్త‌య్యే స‌రికి 81 ప‌రుగుల‌కు 6 వికెట్లు కోల్పోయింది. ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ దెబ్బకి వరుస ఓవర్లలో వికెట్లు చేజార్చుకున్న టీమిండియా.. 13 ఓవర్లు ముగిసే సమయానికి 50/4తో ఒత్తిడిలో కొనసాగుతోంది. మహేంద్రసింగ్ ధోని (11) జ‌డేజా క్రీజులో ఉన్నారు.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (2: 6 బంతుల్లో), శిఖర్ ధావన్ (2: 7 బంతుల్లో) ఇద్ద‌రిని..ఇన్నింగ్స్ రెండో ఓవర్‌ వేసిన ట్రెంట్ బౌల్ట్ తొలుత వికెట్ల ముందు రోహిత్ శర్మని దొరకబుచ్చుకోగా.. ఆ తర్వాత దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన శిఖర్ ధావన్ కూడా నాలుగో ఓవర్‌లో బౌల్ట్ బౌలింగ్‌లోనే కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చి ధోని మ్యాచ్‌ని చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం మొద‌లు పెట్టారు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లి (18: 24 బంతుల్లో 3×4) నిలకడగా ఆడినట్లు కనిపించినా.. తెలివైన బంతితో జట్టు స్కోరు 39 వద్ద అతడ్నీ గ్రాండ్‌హోమ్ బౌల్డ్ చేసేశాడు. త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చి పాండ్యా దూకుడుగా పెంచాడు. దూకుడుగా ఆడుతున్న పాండ్యాని (31) గ్రాండ్ హోమ్ చ‌క్క‌టి బంతికి కీప‌ర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ప్ర‌స్తుతం క్రీజులో ధోని (17)39, జ‌డేజ 0తో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -