Monday, May 6, 2024
- Advertisement -

ఏమైంది టీమిండియాకు… పోరాట‌మా…? త‌లొంచ‌డ‌మా..?

- Advertisement -

సెంచూరియన్ టెస్టులో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. 287 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సారథి విరాట్ కోహ్లీ సహా ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్ స్వల్ప కోరుకే బ్యాట్లెత్తేశారు. దీంతో గెలుపు అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 35/3తో నిలిచింది. ఛెతేశ్వర్‌ పుజారా (11; 40 బంతుల్లో 1×4), పార్థివ్‌ పటేల్‌ (5; 24 బంతుల్లో) క్రీజులో ఉన్నారు.

రెండో టెస్ట్‌లో టీమిండియాను ఆదుకున్న కెప్టెన్ కోహ్లీ రెండో ఇన్నీంగ్స్‌లోకూడా ఆదుకుంటార‌నుకున్నారు. కాని విరాట్‌ కోహ్లీ (5; 20 బంతుల్లో 1×4), కేఎల్‌ రాహుల్‌ (4; 29 బంతుల్లో) స్వల్ప వ్యవధిలోనే పెవీలియన్‌ బాటపట్టారు. అరంగేట్ర బౌలర్ లుంగి ఎంగిడి వీరిద్దరినీ ఔట్‌ చేశాడు. అనంతరం రబాడ బౌలింగ్‌లో మురళీ విజయ్ (9; 25 బంతుల్లో 1×4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

అంతకుముందు దక్షిణాఫ్రికా తన రెండో ఇన్నింగ్స్‌లో 258 పరుగుల వద్ద ఆలౌటైంది. 90/2 ఓవర్‌ నైట్‌ స్కోరుతో నాలుగో రోజైన మంగళవారం (జనవరి 16) ఇన్నింగ్స్‌ కొనసాగించిన సఫారీలు.. మరో 168 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయారు. భారత్‌కు 287 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. డివిలియర్స్‌ (80;121 బంతుల్లో 10 ఫోర్లు), డీన్‌ ఎల్గర్‌ (61; 121 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌) దాటిగా ఆడటంతో సఫారీలకు గౌరవప్రదమైన స్కోరు దక్కింది.

అనంతరం ఫిలాండర్‌ (26;85 బంతుల్లో 2 ఫోర్లు) సహకారంతో డుప్లెసిస్‌ (48; 141 బంతుల్లో 4 ఫోర్లు) కూడా బాధ్యతాయుతంగా ఆడి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. టీమిండియా బౌలర్లలో మొహమ్మద్‌ షమీ 4 వికెట్లు సాధించగా, బుమ్రా 3 వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్‌ శర్మకు 2, అశ్విన్‌‌కు ఒక వికెట్‌ దక్కాయి.

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు ఏదీ కలిసి రాలేదు. నలుగురు దక్షిణాఫ్రికా పేసర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చెలరేగుతుంటే ఒక్కో పరుగు తీయడానికి మన బ్యాట్స్‌మెన్‌ తీవ్రంగా శ్రమించారు. ఈ ఒత్తిడి చివరకు వికెట్లు కోల్పోయేలా చేసింది. రబడ అద్భుత బంతిని విజయ్‌ (9) వికెట్లపైకి ఆడుకోగా… ఇన్‌గిడి వేసిన బాల్‌ను రాహుల్‌ (4) నేరుగా ఫీల్డర్‌ చేతుల్లోకి కొట్టాడు.

సెంచూరియన్‌ టెస్టులో భారత్‌ నెగ్గాలంటే ఇంకా 252 పరుగులు చేయాలి. చేతిలో ఉన్న ఏడు వికెట్లతో భారత్‌ ఏ మేరకు పోరాడుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -