Saturday, April 27, 2024
- Advertisement -

భారత్‌ – దక్షిణాఫ్రికా తొలి వన్డే

- Advertisement -

జోహన్నెస్ బర్గ్ వేదికగా ఇవాళ భారత్ – దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. టీ 20 సిరీస్ సమం కాగా సీనియర్ ఆటగాళ్లు రోహిత్, విరాట్, బుమ్రా అందుబాటులో ఉండటం లేదు. ఇక కేఎల్ రాహుల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా రుతురాజ్‌ గైక్వాడ్‌, సాయి సుదర్శన్‌ ఓపెనింగ్‌ రానున్నారు. తిలక్‌ వర్మ మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేయనుండగా శ్రేయస్‌ అయ్యర్‌, రాహుల్‌ తర్వాతి స్థానాల్లో రానున్నారు. ఇక రింకూ సింగ్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

స్పిన్నర్ల కోటాలో కుల్దీప్‌తో పాటు అక్షర్‌,ముఖేశ్‌ కుమార్‌, అవేశ్‌ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ పేస్‌ భారాన్ని మోయనున్నారు. ఇక సొంతగడ్డపై సత్తాచాటాలని భావిస్తోంది సఫారీ జట్టు. ఎందుకంటే టీ20 సిరీస్ గెలవలేకపోయిన దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ గెలిచి టీమిండియాకు షాకివ్వాలని భావిస్తోంది. మార్క్మ్‌ దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా వ్యవహరించనుండగా హెన్రిక్స్‌, డసెన్‌, క్లాసెన్‌, మిల్లర్‌, ఫెలుక్వాయోతో దక్షిణాఫ్రికా జట్టు పటిష్టంగా ఉంది.

తుది జట్లు (అంచనా)

భారత్‌: రాహుల్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌, సాయి సుదర్శన్‌, తిలక్‌, శ్రేయస్‌, రింకూసింగ్‌/సంజూ శాంస న్‌, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, అవేశ్‌ ఖాన్‌, కుల్దీప్‌ యాదవ్‌, ముఖేశ్‌.

దక్షిణాఫ్రికా: మార్క్మ్‌ (కెప్టెన్‌), హెన్రిక్స్‌, జోర్జీ, డసెన్‌, క్లాసెన్‌, మిల్లర్‌, ఫెలుక్వాయో, ముల్డర్‌, బర్గర్‌, కేశవ్‌ మహరాజ్‌, లిజాడ్‌ విలియమ్స్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -