Saturday, May 11, 2024
- Advertisement -

కోహ్లీకి సేహ్వాగ్ స‌ల‌హా….

- Advertisement -

జనవరి 5 నుంచి సఫారీలతో మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఇప్ప‌టికే సౌతాఫ్రికా చేర‌కున్న టీమిండియా ప్రాక్టీస్‌కూడా ముమ్మ‌రంగా చేస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన సెహ్వాగ్.. సిరీస్ తీరు గురించి తన అభిప్రాయాలు చెప్పాడు.

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ మెరుగ్గా రాణించేందుకు కొన్ని వ్యూహాల్ని అమలు చేయాలని మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సూచించాడు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన టెస్టు సిరీస్‌తో డబుల్ సెంచరీలు బాది సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి.. ఈ పర్యటనలో పరుగుల వరద పారించడం ఖాయమని సెహ్వాగ్ జోస్యం చెప్పాడు.

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత బ్యాట్స్‌మెన్ ఫామ్ చాలా కీలకం. ఒకవేళ సఫారీలు మొదట బ్యాటింగ్ చేస్తే.. ఆ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుని భారత్ ఎంత కష్టమైనా చేరుకోవాలి. అలా చేస్తే వారిపై క్రమంగా ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే.. అది వారి సొంతగడ్డ కాబట్టి. ఈ వ్యూహాన్ని టీమిండియా చక్కగా అమలు చేస్తే చాల‌న్నారు.

ఇక కెప్టెన్‌గా విరాట్ కోహ్లి భారీ స్కోర్లతో జట్టుని ముందుండి నడిపిస్తాడనే నమ్మకం నాకుంది’ అని సెహ్వాగ్ ధీమా వ్యక్తం చేశాడు. కొత్త ఏడాది ఆరంభంలోనే కఠిన సవాల్ భారత్‌కి ఎదురుకానుందని.. అయితే.. ఈ సవాల్‌ని టీమిండియా అలవోకగా అధిగమించగలదు అని ఈ మాజీ ఓపెనర్ వెల్లడించాడు. అంద‌రి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు రాణిస్తుందా…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -