Tuesday, May 14, 2024
- Advertisement -

వైఫ‌ల్యాల‌నుంచి మా జ‌ట్టుస‌భ్యులు పాఠాలు నేర్చుకోలేదు…

- Advertisement -

దక్షిణాఫ్రికా మూడో వ‌న్డేలోకూడా చిత్తుగా ఓడింది. రెండు వ‌న్డేల్లోనూ బ్యాట్ష్‌మేన్ వైఫ‌ల్యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ నేప‌థ్‌యంలో బ్యాట్స్‌మెన్ తప్పిదాల నుంచి పాఠాలు నేర్వలేదని ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ మార్‌క్రమ్ అసహనం వ్యక్తం చేశాడు. భారత్‌తో బుధవారం అర్ధరాత్రి ముగిసిన మూడో వన్డేలో 304 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు పేలవ రీతిలో 179 పరుగులకే కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (4/23), చాహల్ (4/46) బౌలింగ్ ధాటికి క్రీజులో కాసేపు కూడా సఫారీ బ్యాట్స్‌మెన్ నిలవలేకపోయారు. రెండో వన్డేలోనూ ఈ స్పిన్నర్ల జోడి ఎనిమిది వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.

దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ప్రదర్శన మరోసారి నన్ను నిరాశపర్చింది. మూడో వన్డేలోనూ స్థాయికి తగినట్లు ఆడలేకపోయారు. కుల్దీప్ యాదవ్, చాహల్ వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు. తొలి రెండు వన్డేల్లో వారి బౌలింగ్‌‌ని ఎదుర్కోనేందుకు ఇబ్బందిపడిన మా బ్యాట్స్‌మెన్.. నెట్స్‌లో బలహీనతని అధిగమించారనుకున్నా. కానీ.. మూడో వన్డేలోనూ తేలిపోయార‌న్నారు.

సిరీస్ ఫలితాన్ని తేల్చే నాలుగో వన్డే ఈనెల 10న జొహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది. నాలుగో వన్డేకి డివిలియర్స్ జట్టులోకి రానున్నాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా ఆట మారొచ్చు’ అని మార్‌క్రమ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్ జట్టుకి దూరమవడంతో అతని స్థానంలో మార్‌క్రమ్‌ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -