Friday, March 29, 2024
- Advertisement -

విండీస్ తో టి20.. జోరు కొనసాగేనా ?

- Advertisement -

వరుస విజయాలతో టీమిండియా ఫుల్ జోష్ లో ఉంది. ఆ మద్య ఇంగ్లండ్ తో జరిగిన వన్డే సిరీస్, టి20 సిరీస్ కైవసం చేసుకున్నా టీమిండియా, ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో కూడా అదే జోరు కొనసాగించి విండీస్ టిమ్ ను వైట్ వాష్ చేసి సిరీస్ కైవసం చేసుకుంది. ఇక జులై 29 న ( నేడు ) ప్రారంభం కానున్న అయిదు మ్యాచ్ ల టి20 సిరీస్ కోసం టీమిండియా ఉవిళ్లురుతోంది. తొలి మ్యాచ్ ట్రినిడాడ్ లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరగనుంది. ఇక ఇప్పటికే స్వదేశంలో వన్డే సిరీస్ కోల్పోయిన విండీస్ జట్టు టి20 సిరీస్ పై ఆధిపత్యం చలాయించాలని చూస్తోంది. టి20 మ్యాచ్ లలో వెస్టిండీస్ ప్రధర్శన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. .

టి20 మ్యాచ్ లలో విండీస్ బ్యాట్స్ మెన్స్ భీకర ప్రధర్శన కనబరుస్తారు. కాబట్టి విండీస్ ను ఎత్తిపరిస్థితుల్లోనూ తక్కువగా అంచనా వేయలేం. ఇక టీమిండియాకు కూడా టి20 మ్యాచ్ లలో మెరుగైన రికార్డే ఉంది. దాంతో ఈ ఆసక్తికరమైన పోరు కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జట్టు కూర్పు విషయానికొస్తే.. ఈ సిరీస్ కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండనున్నాడు. ఇక అలాగే ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న రిషబ్ పంత్ జట్టుకు మరింత బలం. మరో వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ కూడా తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఇక మిడిలార్డర్ బ్యాట్స్ మెన్స్ విషయానికొస్తే.. శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, కచ్చితంగా తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.

ఎందుకంటే ఇంగ్లండ్ జరిగిన సిరీస్ లో వీరి ప్రధర్శన జట్టుకు అదనపు బలంగా నిలిచింది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. మరి వెస్టిండీస్ తో అతని ప్రధర్శన ఎలా ఉంటుందో చూడాలి. అల్ రౌండర్లుగా హర్డిక్ పాండ్య, దీపక్ హుడ, ఆక్సర్ పటేల్ వంటి వారు అందుబాటులో ఉన్నారు. ఇక బౌలర్ల విషయానికొస్తే హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, కుల్దిప్ యాదవ్ వంటి వారికి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. మొత్తం మీద టీమిండియా అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ పటిష్టంగానే ఉంది. మరి వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా అదే జోరు ఈ టి20 సిరీస్ లో కూడా కొనసాగిస్తోందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -