Saturday, May 11, 2024
- Advertisement -

ఇండియ‌న్ బాహుబ‌ళి రోహిత్ శ‌ర్మ దెబ్బ‌కు మూడు రికార్డులు బ‌ద్ద‌ల్‌..

- Advertisement -

లక్నో వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతోన్న రెండో టీ20లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ వీర విహారం చేశాడు. టీ20ల్లో నాలుగో సెంచరీని నమోదు చేసి ఒక మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సీరీస్‌ను కైవ‌సం చేసుకున్నారు. రోహిత్ దెబ్బ‌కు ఒకే రోజు మూడు రికార్డులు బ‌ద్ద‌ల‌య్యాయి.

రన్ మెషిన్‌గా పేరు పొందిన విరాట్ కోహ్లీని వెనక్కు నెట్టి టీ20ల్లో నెంబర్ వన్‌గా నిలిచాడు. లక్నోలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో రోహిత్ శర్మ 111 పరుగులు సాధించాడు. దీంతో విరాట్ కోహ్లీ రికార్డు బద్దలైంది. 62 ఇన్నింగ్స్‌లో కోహ్లీ 2102 పరుగులు చేస్తే, 85 ఇన్సింగ్స్‌లో రోహిత్ ఆ స్కోర్ దాటాడు.తాజాగా చేసిన 111 పరుగులతో కలపి ఇప్పుడు రోహిత్ శర్మ స్కోర్ 2203కి చేరింది.

మరోవైపు టీ20లో నాలుగు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్ కూడా రోహిత్ శర్మ. న్యూజిలాండ్‌కు చెందిన మన్రో పేరిట ఇప్పటి వరకు ఈ రికార్డు ఉంది. టీ20ల్లో విరాట్ కోహ్లీకి ఒక్క సెంచరీ లేకపోవడం గమనార్హం. అదే సమయంలో రోహిత్ శర్మ నాలుగు సెంచరీలు చేయడం రికార్డు.

లక్నోలో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ మరో ఘనతను కూడా సాధించాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన జంటగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ పేరు టాప్‌లో నిలిచింది. ఆస్ట్రేలియాకు చెందిన వార్నర్, వాట్సన్‌ జోడీ 37 ఇన్సింగ్స్‌లో 1154 రన్స్ చేసింది. అయితే, ఆ రికార్డును ధావన్, రోహిత్ జోడీ బద్దలు కొట్టింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -