Saturday, May 4, 2024
- Advertisement -

చెన్నై ఐపీఎల్ మ్యాచ్‌లు ఇక‌నుంచి పూణేలో

- Advertisement -

కావేరీ జలాల వివాదం చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు నిరాశే మిగిల్చింది. ఆ జట్టు చెన్నైలో ఆడబోయే తదుపరి ఐపీఎల్ మ్యాచ్‌లను బీసీసీఐ పుణే తరలించింది. రెండేళ్ల తర్వాత మంగళవారం చెపాక్ స్టేడియంలో తొలి ఐపీఎల్ మ్యాచ్ నిర్వహించగా.. నిరసనకారుల నుంచి ఆటంకాలు ఎదురయ్యాయి. కావేరీ ఆందోళనల నేపథ్యంలో కోల్‌కతా క్రికెటర్లు స్టేడియానికి రావడం ఆలస్యమైంది, ఫీల్డింగ్ చేస్తున్న సమయంలోనూ రవీంద్ర జడేజాపై బూట్లు విసిరారు. నాలుగు వేల మంది భద్రతా సిబ్బందితో రక్షణ కల్పించినప్పటికీ.. ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు.

ప్రత్యామ్నాయంగా నాలుగు నగరాల పేర్లను చెన్నై టీమ్ ముందు ఉంచినట్లు సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ వెల్లడించారు. వీటిలో ఏపీలోని విశాఖపట్నంతోపాటు త్రివేండ్రం, పుణె, రాజ్‌కోట్ ఉన్నాయి. అయితే వీటిలోనూ పుణెను ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది.

రాకపోకలు సాగించడానికి కూడా విశాఖ కంటే పుణే మెరుగైన నగరమని బీసీసీఐ భావించింది. వైజాగ్ నుంచి ఇండోర్ వెళ్లాలంటే ముందుగా ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి ఇండోర్ చేరుకోవాల్సి ఉంటుంది. పుణేకు మిగతా నగరాలతో మెరుగైన కనెక్టివిటీ ఉంది. దీంతో వైజాగ్‌ను కాదని పుణేను ఎంచుకున్నట్లు సమాచారం. చెన్నై సూపర్ కింగ్స్ తమ తదుపరి హోం మ్యాచ్‌ను ఏప్రిల్ 20న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -