Friday, May 3, 2024
- Advertisement -

అయ్యో ! టీమిండియాకు లంక‌టూర్‌లో ఎంత క‌ష్ఠం వ‌చ్చింది ….

- Advertisement -

ముక్కోణపు టీ20 సిరీస్‌ కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న భారత క్రికెటర్లకి ఊహించని కష్టం ఎదురైంది. శ్రీలంకలో మత ఘర్షణలు చెలరేగడంతో 10 రోజుల పాటు అక్క‌డి ప్ర‌భుత్వంఎమర్జెన్సీని ప్రకటించింది. అల్ల‌ర్లు ఇత ప్రాంతాల‌కు వ్యాప్తి చెంద‌కుండా .. సోషల్ మీడియాపై కూడా తాజాగా నిషేధం విధించింది. దీంతో.. భారత క్రికెటర్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌తో పాటు కనీసం వాట్సాప్ కూడా వినియోగించుకోలేకపోతున్నారు. మంగళవారం రాత్రి శ్రీలంక చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిన భారత జట్టు.. గురువారం రాత్రి 7 గంటల నుంచి బంగ్లాదేశ్‌తో రెండో మ్యాచ్‌లో ఢీకొట్టనుంది.

ఎమర్జెన్సీ కారణంగా.. బుధవారం కనీసం ఒక సెషన్‌ కూడా టీమిండియా ప్రాక్టీస్ చేయలేకపోయింది. ఆటగాళ్లందరూ హోటల్‌ గదులకే పరిమితమైనట్లు మేనేజ్‌మెంట్ వెల్లడించింది. ‘నాకు వాట్సాప్ మెసేజ్‌లు వస్తున్నాయి. కానీ.. వాటిని నేను చదవలేకపోతున్నా. కనీసం కాల్స్ కూడా చేసుకోలేకపోతున్నా. చాలా చిరాకు కలుగుతోంది’ అని భారత క్రికెటర్ ఒకరు మీడియాతో గురువారం వెల్లడించారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే భారత క్రికెటర్లకి ఇది ఊహించని కష్టమే .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -