Sunday, May 12, 2024
- Advertisement -

భార‌త్ గెలుపుతో సంబ‌రాలు చేసుకున్న లంక అభిమానులు…

- Advertisement -

నిదహాస్‌ ముక్కోణపు సిరీస్‌ ఫైనల్‌ ఉత్కంఠ పోరులో భారత్‌ విజయం సాధించి సిరీస్‌ను చేజిక్కించుకుంది. ఇప్పటి వరకూ ఈ సిరీస్‌ రెండు సార్లు జరగ్గా రెండుసార్లు భారత్‌ విజేతగా నిలిచింది. 1998లో జరిగిన టోర్నీలో శ్రీలంకపై ఆరు పరుగులతో గెలుపొంది తొలిసారి సిరీస్‌ సొంతం చేసుకోగా, ఆదివారం రోజు జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 4వికెట్ల తేడాతో గెలుపొంది రెండోసారి కప్‌ను కైవశం చేసుకుంది.

భార‌త్ గెల‌వ‌డంతో ప‌ట్ట‌రాని సంతోషంతో లంక అభిమానులు సంబ‌రాలు చేసుకున్నారు. అదేంటి మ‌నం గెలిస్తే లంక అభిమానులు సంబ‌రాలు చేసుకోవ‌డం ఏంటి అనుకుంటున్నారా..? నిజం. పైన‌ల్లో బగ్లాపై భార‌త్ త్రిల్లింగ్ విక్ట‌రీ సాధించ‌డంతో లంక అభిమానులు సంబ‌రాల్లో మునిగిపోయారు.

సెమీఫైన‌ల్లో శ్రీలంక‌, బంగ్లాదేశ్‌ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో లంక, బంగ్లా ఆటగాళ్లు, అభిమానుల మధ్య తీవ్ర స్థాయిలో పోరు సాగింది. నాదస్వరాలు, నాగిని నృత్యాలతో ఒకరినొకరు రెచ్చగొట్టుకున్నారు. శ్రీలంక, బంగ్లా మధ్య జరిగిన చివరి టీ20లో ఇది తారాస్థాయికి చేరింది. థ్రిల్లింగ్ విక్టరీని సొంతం చేసుకున్న బంగ్లా ఆటగాళ్లు లంకను గేలి చేశారు.

దీంతో వారంతా ఫైనల్లో భారత్‌కు మద్దతు పలికారు. స్టేడియం మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది. మ్యాచ్ జరుగుతోంది కొలంబోలోనా.. కాన్పూర్‌లోనా అనేంతలా.. లంక ఫ్యాన్స్ భారత్‌‌కు సపోర్ట్ ఇచ్చారు. రోహిత్ ఆడుతున్నంత సేపు రోహిత్.. రోహిత్ అంటూ ఉత్సాహ పరిచారు. 18 ఓవర్లో ముస్తాఫిజుర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు లంక ఫ్యాన్స్ షాకయ్యారు. చివర్లో దినేశ్ కార్తీక్ హిట్టింగ్‌ చేస్తున్నప్పుడు తమవాడే ఆడుతున్నంతగా ఉత్సాహపరిచారు. ఆఖరి బంతికి భారత్ గెలవడంతో.. లంక గెలిచిందా..? అనేంతలా సంబరాలు చేసుకున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -