సురేశ్‌ రైనా, స్టార్‌ హీరో భార్య అరెస్టు

- Advertisement -

టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనాను ముంబై పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. ఆయనతో పాటు సింగర్‌ గురు రంధవ, బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ మాజీ భార్య సుసానే ఖాన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. యూరప్‌లో కరోనా కొత్త రూపం సంతరించుకుని వేగంగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. ఈక్రమంలో నిబంధనలకు విరుద్ధంగా పబ్‌ నిర్వహణ, కరోనా నియమాలు పాటించడం లేదనే కారణంగా ముంబై విమానాశ్రయానికి సమీపంలో ముంబై డ్రాగన్‌ క్లబ్‌పై పోలీసులు దాడులు చేశారు.

ఈ సందర్భంగా పైన తెలిపిన ముగ్గురితో పాటు ఏడుమంది పబ్‌ సిబ్బంది సహా మొత్తం 34 మందిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారందరినీ బెయిల్‌పై విడుదల చేశారు. కాగా, ఈ ఏడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రైనా వీడ్కోలు పలికాడు. చెన్నై తరపున ఐపీఎల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. బెంగుళూరు కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ 5,878 పరుగులు అగ్రస్థానంలో, 5,368లతో రైనా రెండోస్థానంలో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -