Sunday, May 5, 2024
- Advertisement -

సిరీస్ ను గెలుచుకోవడం పట్ల శాస్త్రి హర్షం….

- Advertisement -

భారీ వర్షం కారణంగా 8 ఓవర్లకే పరిమితమైన చివరి టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌ 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారిగా సిరీస్‌నూ కైవసం చేసుకుంది. గతంతో ఎన్నడూ కివీస్ పై టీ20 మ్యాచ్ ను గెలవని టీమిండియా… ఇప్పుడు ఏకంగా సిరీస్ ను కైవసం చేైసుకోవడం పట్ల హెడ్ కోచ్ రవిశాస్త్రి హర్షం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు.

బుమ్రా తెలివైన ఆటగాడని… ప్రత్యర్థి జట్టుకు ఏ అవకాశాన్నీ ఇవ్వలేదని కొనియాడాడు. చివరి టీ20లో బుమ్రా 9 పరుగులకు 2 వికెట్లను కూల్చాడ‌న్నాడు. మైదానంలో మెరుపు ఫీల్డింగ్ వల్లే టీమిండియా విజయం సాధ్యమైందని శాస్త్రి అన్నాడు. భారత ఇన్నింగ్స్ ముగిశాక… ఆ స్కోరును కాపాడుకోగలమనే భావించామని చెప్పాడు. 8 ఓవర్ల ఈ మ్యాచ్ లో కేవలం 2 లేదా 3 బంతుల్లోనే మ్యాచ్ స్వరూపం మారిపోయే అవకాశం ఉంటుందని తెలిపాడు. అద్భుతమైన క్యాచ్ లు పడుతూ, పరుగులను నియంత్రించడంలో కోహ్లీ సేన సఫలమైందని చెప్పాడు. ఒత్తిడి లేకుండానే ఆడామని ఎవరైనా చెబితే, అది కచ్చితంగా అబద్ధమేనని అన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -