రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఐపీఎల్ 2026లో టైటిల్‌ను మళ్లీ గెలుచుకునే అవకాశాలపై స్పందించారు భారత మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్. మార్చి 28 నుంచి ప్రారంభమయ్యే IPL 2026 నేపథ్యంలో, ఆర్సీబీ అవకాశాలను అశ్విన్ విశ్లేషించారు.
ప్రస్తుత జట్టుతో ఆర్సీబీకి మళ్లీ టైటిల్ గెలిచే పూర్తి సామర్థ్యం ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డారు. ఈ జట్టు వచ్చే రెండేళ్లలో మరో టైటిల్‌ను ఖాతాలో వేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఐపీఎల్ గెలవడం సులభం కాదు. కానీ ఆర్సీబీ దగ్గర ఉన్న ప్లేయర్లు, సరైన బ్యాకప్‌లు, జట్టు కాంబినేషన్‌లో ఉన్న లోపాలను సరిచేసిన విధానం చూస్తే… టాప్-2లో ముగించే మంచి అవకాశాలు ఉన్నాయి అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అన్నారు.
ఆర్సీబీకి ఒక సవాలు ఏమిటంటే, స్టార్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ ఇప్పటివరకు జట్టులో చేరలేదు. దీంతో టోర్నమెంట్ ప్రారంభ దశలో అతను దూరంగా ఉండే అవకాశం ఉంది.
అయితే, దీనిని అశ్విన్ “బ్లెసింగ్ ఇన్ డిస్గైజ్”గా పేర్కొన్నారు.హాజిల్‌వుడ్ లేకపోతే, ఫిల్ సాల్ట్ ఫామ్‌పై సందేహాలు ఉంటే… సాల్ట్‌తో పాటు బెథెల్‌ను కూడా ఆడించవచ్చు. హాజిల్‌వుడ్ తిరిగి వచ్చిన తర్వాత జట్టు కాంబినేషన్‌పై స్పష్టత వస్తుంది అని అశ్విన్ తెలిపారు.
ఆర్సీబీ విదేశీ ఆటగాళ్ల కాంబినేషన్‌పై అశ్విన్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు.వెంకటేష్ అయ్యర్ ప్రారంభంలో ఆడకపోవచ్చు. కానీ విదేశీ ఆటగాళ్లను చూడండి — సాల్ట్, డేవిడ్, షెఫర్డ్, బెథెల్. ఇది టోర్నమెంట్‌లోనే అత్యుత్తమ టాప్-4 కాంబినేషన్లలో ఒకటి అని అన్నారు. మొత్తంగా చూస్తే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సమతుల్యంగా ఉందని, సరైన వ్యూహంతో ముందుకెళ్తే ఐపీఎల్ 2026లో టైటిల్‌ను కాపాడే అవకాశం ఉందని అశ్విన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
