Monday, May 6, 2024
- Advertisement -

కోహ్లీసేన‌కు చుర‌క‌లంటించిన స‌చిన్‌..

- Advertisement -

కేప్‌టౌన్‌లో జ‌రిగిన మొద‌టి టెస్ట్‌లో భార‌త్ ఘోరంగా ప‌రాజ‌యం చెంద‌డంతో టీమిండియాపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. బౌల‌ర్లు అద్భుతంగా రానించినా బ్యాట్స్‌మేన్‌లు పూర్తిగా విఫ‌ల మ‌య్యారు. సెచూరియ‌న్‌లో జ‌రిగే రెండో టెస్ట్‌కు ముందు క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండుల్క‌ర్ కోహ్లీటీమ్‌కు సుతిమెత్త‌గా విమ‌ర్శ‌లు చేశారు.

స్వదేశీ, విదేశీ పిచ్‌ల స్వభావాన్ని అర్థం చేసుకుని టీమిండియా టెస్టులు ఆడాలని సూచించారు. దక్షిణాఫ్రికాతో ఇప్పటికే ముగిసిన తొలి టెస్టులో భారత్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమవగా.. బౌలర్లు సత్తాచాటారు. భారత్‌‌ పిచ్‌లపై ఆడిన తరహాలోనే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఆదిలోనే స్ట్రోక్స్ ఆడేందుకు ప్రయత్నించడంతోనే వికెట్లు చేజార్చుకున్నట్లు సచిన్ అభిప్రాయపడ్డారు.

టెస్టు క్రికెట్ అనేది అర్థం చేసుకుని స్థానిక పరిస్థితులకి అనుగుణంగా ఆడాల‌న్నారు. భారత్‌ పిచ్‌లతో పోలిస్తే.. విదేశీ పిచ్‌లు పూర్తి భిన్నం. భారత్‌ గడ్డపై అయితే.. బౌలర్లకి 20 ఓవర్ల తర్వాతే పిచ్‌ నుంచి సహకారం లభిస్తుంది. రివర్స్ స్వింగ్‌కి అవకాశం దొరుకుతుంద‌న్నారు.

అదే దక్షిణాఫ్రికా లాంటి పిచ్‌లపై అది పూర్తిగా రివర్స్. మొదటి 25 ఓవర్లు ఫాస్ట్ బౌలర్లకి స్వర్గధామంగా ఉంటుంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకుని.. భారత్‌లో ఆడినట్లు బ్యాట్స్‌మెన్ ఆరంభంలోనే స్ట్రోక్స్ ఆడేందుకు ప్రయత్నించకూడదు’ అని సచిన్ వివరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -