Saturday, May 4, 2024
- Advertisement -

వీల్‌చైర్ క్రికెట‌ర్ల‌కు ఆర్థిక స‌హాయం చేసిన స‌చిన్ టెండూల్క‌ర్‌

- Advertisement -

అంత‌ర్జాతీయ క్రికెట్‌నుంచి త‌ప్పు కున్న స‌చిన్ టెండూల్క‌ర్ సామాజికి సేవ‌లో మాత్రం ముందుంటాడు. క్రికెట‌ర్ దేవుడిగా పిలిచే స‌చిన్ మాన‌వ‌తా మాదిగా త‌న‌కంటూ చ‌రిత్ర‌లో కొన్ని పేజీల‌ను లిఖించుకుంటున్నాడు. త‌న ఆట ద్వారా సంపాదించిన కొంత సొమ్ములో సామాజిక సేవ‌క‌ల‌కు ఉప‌యోగిస్తుంటారు.

తాజాగా మ‌రోసారి స‌చిన్ త‌న మాన‌వ‌తా ద్రుక్ప‌ధాన్ని చాటుకున్నాడు.బంగ్లాదేశ్ వెళ్లి ఆ దేశ వీల్‌చైర్ క్రికెట్ జట్టుతో మన వీల్‌చైర్ క్రికెట్ టీమ్ మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది. కానీ వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. బంగ్లాదేశ్ వెళ్లడానికి విమాన టిక్కెట్లు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. వారు ఐసీసీ, బీసీసీఐని సాయం కోసం అభ్యర్థించినా ఫలితంలేదు. ఈ విషయం ఎలాగోలా సచిన్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన ఆర్థిక సాయం అందించారు. జట్టు మొత్తం బంగ్లాదేశ్ వెళ్లడానికి విమాన టిక్కెట్లను సమకూర్చి త‌న పెద్ద‌మ‌న‌సుల‌ను చాటుకున్నాడు.

 

Image result for wheelchair-cricket- and bangladesh team

 

వాస్తవానికి భారత్‌లో వీల్‌చైర్ క్రికెట్ ఆర్గనైజర్ ప్రదీప్ రాజ్ చెప్పేంత వరకు సచిన్ సాయం చేసిన విషయం ఎవరికీ తెలియదు. 2-1 తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న భారత వీల్‌చైర్ జట్టు మే 9న స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వారికి ఘన స్వాగతం లభించింది.

అంతర్జాతీయ క్రికెట్ మండలి, బీసీసీఐని సాయం కోరినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని వెల్లడించారు. పర్యటనకు వెళ్లడానికి ముందు తమ జట్టు సభ్యులతో టెండూల్కర్ మాట్లాడారని, అది వారికి మరింత ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -