Monday, May 13, 2024
- Advertisement -

చిక్కుల్లో శ్రీలంక మాజీ స్టార్ క్రికెట‌ర్‌..

- Advertisement -

ఒకప్పుడు రికార్డుల వేటలో భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్‌కి సమానంగా దూసుకెళ్లాడు శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య. అయితే ఫామ్ లేమి కారణంగా జట్టులో ఎన్నోరోజులు స్థానం కోల్పోయి, ఆకస్మాత్తుగా రిటైర్మెంట్ చెప్పాల్సిన దుస్థితికి చేరుకున్నాడు జయసూర్య. 1996లో లంకజట్టు వరల్డ్‌కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇప్పుడు ఐసీసీ కోడ్ ఉల్లంఘించి చిక్కుల్లో ప‌డ్డారు.

రెండు వేర్వేరు సందర్భాల్లో యాంటీ- కరెప్షన్ కోడ్ ఉల్లంఘించాడనే కారణంగా జయసూర్యకు నోటీసులు జారీ చేసింది ఐసీసీ.స్పందించకపోతే ఐసీసీ నియమాల ప్రకారం తీసుకోబోయే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ఆర్టికల్ 2.4.6 ప్రకారం విచారణకు అందుబాటులో లేకపోవడం, విచారణ అధికారులకు సహకరించకపోవడం, కావల్సిన సమాచారాన్ని, డాక్యుమెంట్లను సమర్పించకపోవడం వంటి ఫిర్యాదులతో పాటు ఆర్టికల్ 2.4.7 ప్రకారం విచారణ ఆలస్యం కావడానికి ప్రత్యేక్షంగా కారణమవ్వడం, ఆధారాలు, సాక్ష్యాలను మాయం చేయడం వంటి రెండు ఆర్టికల్స్ కింద జయసూర్యపై ఐసీసీ అభియోగాలు నమోదుచేసింది.

శ్రీలంక దిగ్గజ క్రికెటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన సనత్ జయసూర్య… 445 వన్డేలు, 110 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 1996లో లంకజట్టు వరల్డ్‌కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా లంక పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా కూడా సేవలు అందిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -