Saturday, April 27, 2024
- Advertisement -

అల్లు అర్జున్ కి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!

- Advertisement -

టాలీవుడ్ లో అల్లు అర్జున్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన ఏ సినిమా చేసిన అందులో ఓ కొత్తదనం ఉండేలా చూసుకుంటారు. అందుకే ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. అయితే అల్లు అర్జున్ కి స్టైలీష్ స్టార్ అనే బిరుదు ఉంది.

అందుకే ఆయన ఎక్కడ కనిపించిన స్టైలిష్ గా కనిపిస్తారు. ప్రస్తుతం ఆయన నటించిన అల వైకుంఠ‌పుర‌ములో సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానునుంది. ఈ సినిమాలోని పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. గతంలో బన్నీతో త్రివిక్రమ్ తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక విజయ్ దేవరకొడ కి కూడా టాలీవుడ్ లో విపరితమైన క్రేజ్ ఉంది.

అతను ఏం చేసిన అది ఓ పెద్ద సంచలనం అవుతుంది. అయితే తాజాగా అల్లు అర్జున్‌కు విజయ్‌ దేవరకొండ కొత్త దుస్తులు పంపాడు. ఈ విషయాన్ని బన్నీ తన ట్విట్టర్ ఖాతాలో తెలుపుతూ ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశాడు. ‘నీకు చాలా కృతజ్ఞతలు సోదరా. ఇదో మధురానుభూతి.. నువ్వు చెప్పిన‌ట్టుగానే బ‌ట్ట‌లు పంపావు. ఈ డ్రెస్‌ను వేసుకొని అల వైకుంఠ‌పుర‌ములో సినిమా సెల‌బ్రేష‌న్‌కి వస్తా’ అని అల్లు అర్జున్‌ తెలిపాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -