శ్రీరెడ్డి ఆత్మహత్యాయత్నం.? …..షేక్ అవుతున్న ఇండస్ట్రీ..సోషియ‌ల్ మీడియాలో వైర‌ల్‌…?

3175
Actress Sri reddy tried to commit suicide...?
Actress Sri reddy tried to commit suicide...?

శ్రీరెడ్డి తెగింపు గురించి కొత్తగా చెప్పేదేముంది? శ్రీరెడ్డి చెప్తున్న మాటల్లో నిజానిజాలు ఎలా ఉన్నా రాజకీయంగా పలుకుబడితో పాటు బలం, బలగం నిండుగా ఉన్న బడా బడా వ్యక్తులపై పోరాటానికి దిగడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా శ్రీరెడ్డి లాంటి మహిళ అంత ధైర్యంగా నిలబడడం గొప్ప విషయమే. అయితే శ్రీరెడ్డి ధైర్యం కంటే తెగువ ఎక్కువ అని ఆమెను దగ్గరగా చూసినవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ తెగింపుతోనే శ్రీరెడ్డి ఆత్మహత్యాయత్నం చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేేసిన తర్వాత శ్రీరెడ్డికి అండగా నిలబడిన జనాలందరూ కూడా వ్యతిరేకులయ్యారు.

నిన్నటి నుంచీ శ్రీరెడ్డి ఆ ఫ్రస్ట్రేషన్‌లోనే ఉంది. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతున్నందుకు బాధగా ఉందని……అందరూ కలిసి తనను ఒంటరిని చేశారని ఆవేదన వ్యక్తం చేసింది శ్రీరెడ్డి. ఆ ఆవేదనతోనే ఆత్మహత్యా యత్నం చేసిందట. అన్నింటికీ మించి శ్రీరెడ్డి ఇంటి ముందు పవన్ కళ్యాణ్ అభిమానులు ధర్నా చేయడం…….ఆ సందర్భంలోనే శ్రీరెడ్డిని అనరాని మాటలూ అనడంతో శ్రీరెడ్డి ఆత్మహత్యాయత్నం చేసిందని చెప్తున్నారు. అయితే తన సూసైడ్ లెటర్‌లో తన దగ్గర ఉన్న ఆధారాలతో పాటు అన్ని వివరాలు చేర్చిన శ్రీరెడ్డి ……వాళ్ళందరినీ శిక్షించాలన్నదే తన ఆఖరి కోరికగా చెప్పిందట. ఈ వార్త తెలుసుకున్న మహిళా సంఘాలతో పాటు శ్రీరెడ్డి సపోర్టర్స్ కూడా శ్రీరెడ్డి దగ్గరకు వెళ్ళారని తెలుస్తుంది. తన సూసైడ్ లెటర్‌లో సినిమా సెలబ్రిటీస్ పేర్లను శ్రీరెడ్డి ప్రముఖంగా ప్రస్తావించిందన్న వార్తతో ఇప్పుడు ఇండస్ట్రీ సెలబ్రిటీస్ షేక్ అవుతున్నారని తెలుస్తోంది.

ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి ప్ర‌య‌త్నించిన శ్రీరెడ్డిని హైద‌రాబాద్‌లోని ప్ర‌ముఖ హాస్ప‌ట‌ల్‌లో చేర్పించిన‌ట్లు స‌మాచారం. ఆమె ఆరోగ్య ప‌రిస్థితులు గురించి చెప్ప‌డానికి డాక్ట‌ర్లు నిరాక‌రిస్తున్నార‌నే వార్త‌లు మీడియాలో సంచ‌ల‌నం రేపాయి. కాని అలాంటి వార్త‌లో ఎలాంటి వాస్త‌వం లేద‌ని ఆమె స‌న్నిహితులు చెబ్తున్నారు. ఆమె ఆత్మ‌హ‌త్యాయ‌త్నం ప‌ర‌ముఖ టెలివిజ‌న్‌లో రావ‌డం మ‌రింత క‌ల‌క‌ల‌కం రేపుతోంది. అయితే శ్రీరెడ్డి స్వ‌యంగా ధ్రువీక‌రిస్తే దీనిపై మ‌రింత క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Loading...