త్రివిక్రమ్ కి బన్నీ పెట్టిన కండీషన్ అదేనా?

210
Allu Arjun Condesation to Trivikram Srinivas
Allu Arjun Condesation to Trivikram Srinivas

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మూడో సారి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు జత కట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. సాధారణం గా త్రివిక్రమ్ శ్రీనివాస్ పూర్తి బౌండ్ స్క్రిప్ట్ లేకుండా నే సినిమా మొదలు పెడతాడు కానీ ఈ సారి ప్రత్యేకంగా ఈ సినిమా ని మాత్రం బౌండ్ స్క్రిప్ట్ పూర్తి అయ్యాక నే మొదలు పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం. అయితే దీని వెనుక ఒక థియరీ ఉంది అంటున్నారు ఫిలిం నగర్ వర్గాలు.

అల్లు అర్జున్ ఈ సినిమా ని ప్రత్యేకంగా తన సొంత గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మించాలి అనుకుంటే త్రివిక్రమ్ మాత్రం హారిక హాసిని సంస్థ ని కూడా ఈ సినిమా నిర్మాణం లో భాగం చేయాలి అని చెప్పాడట. అందుకు ఒప్పుకోవడానికి బన్నీ దర్శకుడికి ఒక కండీషన్ పెట్టాడట. ఈ సినిమా బౌండ్ స్క్రిప్ట్ పూర్తి చేసాక నే సినిమా షూట్ స్టార్ట్ చేస్తాను అని, అప్పుడు మాత్రమే ఈ సినిమా పట్టాలెక్కుతుంది అని చెప్పాడట.

అందుకే త్రివిక్రమ్ సమయం తీసుకొని స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసుకొని, ఇప్పుడు షూట్ మొదలు పెట్టాడట. డిసెంబర్ లో మొదలు కావాల్సిన సినిమా అందుకే ఆలస్యం గా మొదలు అయింది అంట. అందుకని నిర్మాత కి ఆర్ధికంగా నష్టం కూడా వచ్చింది అని టాక్.

Loading...