Saturday, April 27, 2024
- Advertisement -

‘రెడ్ బ‌స్’ నుంచి అల్లు అర్జున్‌ని తొల‌గించారా..?

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మ‌హేశ్ , ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల త‌రువాత అంత‌టి క్రేజ్ తెచ్చుకున్న హీరో బ‌న్నినే. త‌న యాక్టింగ్‌, డ్యాన్స్‌ల‌తో చాలామంది అభిమానుల‌ను సంబంధించుకున్నాడు. బ‌న్నికి తెలుగులో ఎంత‌టి మార్కెట్ ఉందో కేర‌ళ‌లో కూడా అంతే మార్కెట్ ఉంది. బ‌న్ని న‌టించిన ప్ర‌తి సినిమా కేర‌ళలో కూడా విడుద‌ల అవుతుంటుంది. అక్క‌డ బ‌న్నికి మంచి ఫ్యాన్ ఫాలొయింగ్ ఉంది.

ఈ క్రేజ్ ద్వారానే కొన్ని సంస్థ‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హారిస్తున్నాడు బ‌న్ని. వాటిలో రెడ్ బ‌స్ కూడా ఒక‌టి. అస‌లు రెడ్ బ‌స్ అనే యాప్ కాని, ట్రావెల్ సంస్థ ఒక‌టి ఉంద‌ని బ‌న్ని ద్వారానే తెలిసింది. రెడ్ బ‌స్ కోసం బ‌న్ని చేసిన యాడ్స్ జ‌నాల్లోకి బాగా పాపుల‌ర్ అయ్యాయి. దీంతో చాలామంది రెడ్ బ‌స్ ద్వారా త‌మ టికెట్ల‌ను బుక్ చేసుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. అయితే రెడ్ బ‌స్‌తో బ‌న్నికి ఇచ్చిన కాంట్రాక్ట్ ముగిసింద‌ని తెలుస్తోంది. బ‌న్ని ఈ కాంట్రాక్ట్‌ను పొడిగించాల‌ని అనుకోవ‌డం లేద‌ట‌. దీనికి కార‌ణం కూడా లేక‌పోలేదు. బ‌న్ని ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఇదే స‌మ‌యంలో త‌మ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా కూడా నిర్మిస్తున్నాడ‌ట‌.

ఇటువంటి స‌మయంలో రెడ్ బ‌స్ కాంట్రాక్ట్ పొడిగించ‌డం క‌రెక్ట్ కాద‌ని బ‌న్ని అభిప్రాయ‌ప‌డుతున్నాడ‌ట‌. పైగా బ‌న్ని ఏపీలో మల్టీఫ్లెక్స్ థియోట‌ర్ క‌ట్టే ఆలోచ‌న చేస్తున్నాడ‌ట‌. అయితే ఈ మ‌ల్టీఫ్లెక్స్‌ను విజ‌యవాడ‌లో క‌ట్టాలా, లేక వైజాగ్‌లో క‌ట్టాలా అనే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ని తెలుస్తోంది. ఇంత బిజీ షెడ్యూల్లో రెడ్ బ‌స్ కోసం డేట్స్ ఇవ్వడం కుద‌ర‌ద‌నే ఉద్దేశంతోనే ఆయ‌న ఈ కాంట్రాక్ట్ నుంచి త‌ప్పుకున్నాడ‌ట‌. బ‌న్ని ప్ర‌స్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శక‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ నిన్న‌నే(బుధ‌వారం) మొద‌లైంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డె న‌టిస్తుంద‌ని స‌మాచారం. సినిమా టైటిల్‌ను అల‌క‌నంద‌గా నిర్ణయించార‌ని టాక్ వినిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -