Friday, April 26, 2024
- Advertisement -

‘అమ్మాయంటే అలుసా’ ఆడియో ఆవిష్కరణ

- Advertisement -

కార్తీక్ రెడ్డి, నేనే శేఖర్, స్వాతి, శ్వేత, ఆయోషా హీరో హీరోయిన్లుగా ఎన్.భాస్కర్ రెడ్డి సమర్పణలో గీతా శ్రీ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం అమ్మాయంటే అలుసా. సి.హెచ్.కరుణాకర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. నేనే శేఖర్ దర్శకత్వంలో యలమంచిలి సిస్టర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. బిగ్ సీడీ, ఆడియో సీడీలను నటి కవిత విడుదల చేశారు. ఈ సందర్భంగా….

కవిత మాట్లాడతూ ‘’స్త్రీలను ఎప్పటి నుండో చిన్నచూపు చూస్తున్నారు. అదే దోరణి ఇప్పటికి కూడా కొనసాగుతుంది. అలా చిన్నచూపు చూస్తే ఏమౌతుందనే కాన్సెప్ట్ తో రూపొందించిన సినిమాయే అమ్మాయంటే అలుసా. కథ హీరో. నేనే శేఖర్ గారు దర్శకత్వంతో, నటన ఇలా అన్నీ తానై సినిమాను ముందుకు నడిపించారు. కరుణాకర్ గారి సంగీతం బావుంది. సినిమా పెద్ద సక్సెస్ కావాలి. యూనిట్ సభ్యులందరికీ థాంక్స్’’ అన్నారు.

రాజు మాట్లాడుతూ ‘’నేనే శేఖర్ తో చాలా కాలంగా మంచి పరిచయం ఉంది. మంచి హార్డ్ వర్కర్. అన్నీ తానై ఈ సినిమాను ముందుకు నడిపిస్తున్నాడు. తనకు పెద్ద  సక్సెస్ వచ్చి మంచి పేరు, లాభాలు రావాలి. కరుణాకర్ గారి సంగీతం బావుంది. ఆడియో, సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ ‘’అందరూ సినిమా కోసం చాలా కష్టపడి చేశాం. కరుణాకర్ గారు మంచి మ్యూజిక్ అందించారు. ఆడియో, సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

కరుణాకర్ మాట్లాడుతూ ‘’సినిమాలో ఏడు సాంగ్స్ ఉన్నాయి. అలాగే చక్కటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కుదిరింది. శేఖర్ నటనతో పాటు డైరెక్షన్ చేశాడు. సినిమా అవుట్ పుట్ బాగా వచ్చింది. సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. యూనిట్ సభ్యులందరికీ థాంక్స్’’ అన్నారు.

నేనే శేఖర్ మాట్లాడుతూ ‘’నేను చాలా సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా వర్క్ చేశాను. ఆ అనుభవంతో నా పరిధిలో సినిమాను చాలా కష్టపడి తెరకెక్కించాం. నాకు కరుణాకర్ గారు, కార్తీక్ రెడ్డి సహా అందరూ బాగా సపోర్ట్ చేశారు. అడవాళ్లను అలుసుగా చూడకూడదు. వారికి గౌరవం ఇవ్వాలనే కాన్సెప్ట్ తో రూపొందించిన సినిమా. క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమాను ఎలాగైతే ఎంజాయ్ చేశారో ఈ సినిమాలో సెకండాఫ్ ను అలా ఎంజాయ్ చేస్తారు. సినిమాను మే నెలాఖరున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్రయూనిట్ ను అభినందించారు.

కార్తీక్ రెడ్డి, నేనే శేఖర్, స్వాతి, శ్వేత, ఆయోషా నటించిన ఈ చిత్రానికి సంగీతం: సి.హెచ్.కరుణాకర్, కెమెరా: జీవా,  కో ప్రొడ్యూసర్స్: గౌరీ శంకర్, మాధవరెడ్డి, ప్రొడ్యూసర్స్: యలమంచిలి సిస్టర్స్, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నేనే శేఖర్. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -