Saturday, April 27, 2024
- Advertisement -

హీరోయిన్ గా పనికి రావు అంటూనే పెళ్లి చేసుకున్న రాంకీ..!

- Advertisement -

కొన్నిసార్లు చేయకుడదు అనుకున్న పనులే చేయాల్సి వస్తూ ఉంటుంది. వద్దనుకున్న సినిమా చేయాల్సి వస్తోంది. చెయ్యాలనుకున్న సినిమా కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అవుతోంది. ప్రధానంగా హీరోల విషయంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. అలనాటి హీరో రాంకీ విషయంలో కూడా ఇదే జరిగింది.

ఈయన ‘సింధూరపువ్వు’ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్న రోజులవి. డైరెక్టర్ దేవరాజ్ ఆ చిత్రంలో హీరోయిన్ గా.. నిరోషాను తీసుకోవాలనుకుంటున్నట్టు హీరో రాంకీకి చెప్పారట. అందుకు ఆయన ఈమె హీరోయిన్ ఏంటండి.. పనిమనిషిలా ఉంది అని కామెంట్స్ చేశారు. అందుకు దర్శకుడు ఒప్పుకోకుండా ఆమెనే హీరోయిన్ గా పెట్టాడట. ఈ చిత్రం తర్వాత కచ్చితంగా ఈమె టాప్ హీరోయిన్‌గా ఎదుగుతుంది అంటూ రాంకీని ఒప్పించాడట. ఆయన చెప్పినట్టు గానే సినిమా సూపర్ హిట్ అయ్యింది.

రాధికా శరత్ కుమార్ చెల్లెలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిరోష ఆ తరువాత బాలకృష్ణతో ‘నారీ నారీ నడుమ మురారీ’, చిరంజీవితో ‘స్టువర్టుపురం పోలీస్ స్టేషన్’ ,మణిరత్నం ‘ఘర్షణ’ వంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. తరువాత హీరో రాంకీతో ఈమె కలిసి నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్లే.. ఆ సినిమాల షూటింగ్ టైంలోనే వారి మధ్య ప్రేమ చిగురించి.. తరువాత అది పెళ్లి వరకూ వెళ్లింది. సో అలా వద్దనుకున్న హీరోయిన్ నే రాంకీ పెళ్లి చేసుకున్నాడు.

నా బెస్ట్‌ఫ్రెండ్‌ ట్రాన్స్‌జెండర్ : ఉపాసన

35 ఏళ్ళ వయసులో అనసూయ ఎలా రెచ్చిపోయిందో చూడండి..!

డబ్బుల విషయంలో అమ్మ రాజశేఖర్ మోసం చేశాడు : సమీర్

హీరోయిన్ సంఘవి గుర్తుందా ? ఇప్పుడేం చేస్తుందంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -