Friday, April 26, 2024
- Advertisement -

బిగ్‌బాస్ కి కమిట్మెంట్ ఇచ్చింది : యాంకర్ రవి కామెంట్స్

- Advertisement -

బిగ్ బాస్ లోకి శ్రీముఖి వెళ్లినప్పటి నుంచి ఆమె గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతునే ఉంది. బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ గెలుస్తుందన్న ఆమె చివరకు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. పటాస్ లో రవి పక్కన యాంకరింగ్ చేసింది శ్రీముఖి. ఇప్పుడు ఆమె గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు రవి.

వివరాల్లోకి వెళ్తే.. శ్రీముఖి గురించిన కొన్ని విషయాలు చెబుతూ తమపై వస్తున్న రూమర్స్ ఖండించాడు. శ్రీముఖి ఓ అద్భుతమైన కో యాంకర్ అని, అలాగే ఆమె మంచి అమ్మాయని తెగ పొగిడాడు రవి. తాను పటాస్ నుంచి బయటికి రాగానే.. శ్రీముఖి వెళ్ళింది కాబట్టి రవి వెళ్ళాడు అని అనుకున్నారు కానీ, నా వ్యక్తిగత కారణాల వల్లనే తాను బయటకొచ్చానని చెప్పాడు.

శ్రీముఖి బిగ్ బాస్ కమిట్మెంట్ ఉండటం వల్లే పటాస్ నుంచి వెళ్లిపోయిందని.. ”కెరీర్ ఎదగాలంటే పెద్ద ఆఫర్ వచ్చినపుడు మరోదాన్ని వదిలేసుకోవడంలో తప్పేముంది.. శ్రీముఖి అదే చేసింది. నేను కూడా అదే చేశాను” అని ఓపెన్‌గా చెప్పేశాడు రవి. ఇక శ్రీముఖితో తనకు గొడవలు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని.. అందులో ఎలాంటి నిజం లేదని రవి క్లారిటీ ఇచ్చాడు. శ్రీముఖి తనకు బెస్ట్ ఫ్రెండ్ అని అన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -