బిగ్ బాస్ కోసం రిజైన్ చేసిన యాంకర్

456
Anchor Savitri exit from the Teenmaar show to Participant in Bigg Boss Telugu 3
Anchor Savitri exit from the Teenmaar show to Participant in Bigg Boss Telugu 3

తెలుగు టీవీ ప్రేక్షకులందరూ బిగ్ బాస్ మూడవ సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తో హోస్ట్ గా మారిన టాలీవుడ్ కింగ్ నాగర్జున బిగ్ బాస్ సీజన్ 3 కి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొనబోయే కంటెస్టెంట్ ల గురించి ఇప్పటికే బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. తాజాగా ప్రముఖ యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ లో పాల్గోనబోతోంది అని వార్తలు వినిపించాయి.

గత సీజన్లో కౌశల్ కి కౌశల్ ఆర్మీ పేరుతో ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చినట్లు శ్రీముఖి కూడా శ్రీముఖి ఆర్మీ అంటూ ఫ్యాన్ పేజీలు సోషల్ మీడియాలో మెరుస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మరొక ప్రముఖ యాంకర్ జాబ్ నుంచి రిజైన్ చేసిందని తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు సావిత్రి. సావిత్రి అసలు పేరు జ్యోతి. సావిత్రక్క అనే టీవీ షో తో బిత్తిరి సత్తి తో పాటు ఈమె కూడా కనిపిస్తుంది. తాను ఇప్పటి దాకా పనిచేస్తున్న న్యూస్ ఛానల్ నుంచి తను పోస్ట్ కి రిజైన్ చేసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె రిజైన్ చేయడానికి కారణం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడమని కొందరు అంటున్నారు. అయితే దీని గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

Loading...