Friday, April 26, 2024
- Advertisement -

అభిమానికి ముద్దుపెట్టిన యాంకర్ వర్షిణి..!

- Advertisement -

ఎవరు ఏ రకంగా ఫేమస్ అవుతారో చెప్పాలేం. ఆ మధ్య ఓ అభిమాని యాంకర్ కు ముద్దు పెట్టడంతో ఆ ఇద్దరూ ఫేమస్ అయ్యారు. తాజాగా ఇలాంటిదే పటాస్ షోలోనూ జరిగింది. పెళ్లిగోల అనే వెబ్ సిరీస్ తో వర్షణి బాగానే ఫేమస్ అయింది. దాంతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది.

సినిమాల్లో చేస్తునే యాంకర్ గా తనకంటూ ఇంకా మంచి గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది. ఢీ షోలో సుధీర్, రష్మీలతో పాటు వర్షిణి కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ టైంలో కాస్త పేరు తెచ్చుకుంది. ఈమెను తమ పంచ్ లతో ఆడుకోవడం.. ఏం తెలియని తింగరి బుచ్చిలా ఉండటం.. ఇక ఆమె వేసే పిచ్చి స్టెప్పులు ఇలా ఆమెను అందరూ గుర్తుపట్టేలా చేశాయి.

పటాస్ నుంచి శ్రీముఖి బయటకు వచ్చిన తర్వాత ఆమె స్థానాన్ని భర్తీ చేయడం కోసం బానే కష్టపడుతోంది వర్షిణి. శ్రీముఖిలా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నంలో ఉన్న వర్షిణి.. ఓ పని చేసి అందరి దృష్టిలో మళ్లీ పడింది. పటాస్ షోలో మాట్లాడేందుకు మైక్ తీసుకున్న అభిమానిని చూసి.. చాలా ముద్దుస్తున్నాడే.. రా.. అంటూ ఆ కుర్రాడ్ని స్టేజ్ మీదకు పిలుస్తోంది వర్షిణి.. స్టేజ్ మీదకు వచ్చిన కుర్రాడి బుగ్గల్ని లాగడమే కాదు.. అమాంతం బుగ్గను కొరికేయటం సంచలనంగా మారింది. యాంకర్ చేసిన పనికి ఆ కుర్రాడు సిగ్గు పడిపోయాడు. దీని చూసిన వారంతా షాక్ అయ్యారు. ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -