Saturday, April 27, 2024
- Advertisement -

త‌మిళ అర్జున్ రెడ్డి పోస్ట‌ర్ అదుర్స్‌

- Advertisement -

అర్జున్ రెడ్డి తెలుగు ఇండ‌స్ట్రీకి ఓ ట్రెండ్ సెట్ట‌ర్ మూవీ. ఈ మూవీతో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఓవ‌ర్ నైట్ స్టార్ హీరోగా మారాడు. చిత్ర ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగాతో సినిమాలు చేయ‌డానికి టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు సైతం ఓకే చెప్పాడు. మ‌రి అలాంటి సినిమాను అన్ని బాషల‌లో తెర‌కెక్కించ‌డానికి ప్ర‌య‌త్నలు జ‌రుగుతున్నాయి.

త‌మిళంలో ఈ సినిమాను స్టార్ డైరెక్ట‌ర్ బాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. త‌మిళ అర్జున్ రెడ్డి సినిమాలో హీరోగా విక్ర‌మ్ కొడుకు ధృవ్ హీరోగా త‌మిళ తెర‌కు ప‌రిచియ‌మ‌వుతున్నాడు. తమిళంలో ‘వర్మ’ అనే టైటిల్ తో ఈ రీమేక్ తెరకెక్కింది. గత కొన్ని రోజులుగా ఆసక్తి రేపుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదలకు ముందే ఈ చిత్రం ఫస్ట్ లుక్ లీక్ అయ్యింది. లీక్ అయిన పోస్టర్ ప్రస్తుతం తమిళ ప్రేక్షకులను మెప్పించింది. తెలుగు చిత్రంలో మాదిరిగానే తమిళ వర్షన్లో కూడా ముద్దులు భారీగా ఉన్నట్లుగా సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -