Friday, April 26, 2024
- Advertisement -

జయలలిత బయోపిక్ లో ‘రోజా’ నటుడు

- Advertisement -

ప్రస్తుతం బయోపిక్ ల హవా బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సెలబ్రిటీల బయోపిక్స్ విడుదలయ్యాయి. తాజాగా ఇప్పుడు తమిళ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘తలైవి’. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో కంగనారనౌత్ జయలలిత పాత్రలో కనిపించబోతున్నారు. ఏ ఎల్ విజయ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించిన ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

కోలీవుడ్ స్టార్ అరవిందస్వామి తెలుగులో కూడా ‘రోజా’ వంటి సినిమాలతో మంచి ఇమేజ్ ను ఏర్పరుచుకున్నారు. ఈ మధ్యనే ‘నవాబ్’ సినిమాలో కనిపించిన అరవిందస్వామి ఇప్పుడు ఈ సినిమాలో ప్రముఖ నటుడు మరియు ఒకప్పటి ముఖ్యమంత్రి అయిన ఎం.జి.ఆర్ పాత్ర పోషించబోతున్నారు అని సమాచారం. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రముఖ రైటర్ కె విజయేంద్ర ప్రసాద్ మరియు రాజ్ అరోరా ఈ సినిమాకి స్క్రిప్ట్ ను అందిస్తున్నారు. పాన్ ఇండియన్ సినిమాగా రాబోతున్న ఈ బయోపిక్ హిందీ మరియు తమిళ భాషల్లో విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -