Friday, April 26, 2024
- Advertisement -

న‌టిని బాత్‌రూమ్‌లో కొట్టి ప‌డేసిన భ‌ర్త‌

- Advertisement -

ఈ మ‌ధ్య సామాన్య ప్ర‌జ‌ల‌తో పాటు సెల‌బ్రిటీలకు కూడా లైంగిక వేధింపులు, గృంహ హింస త‌ప్ప‌డం లేదు. తాజాగా మ‌రో సెల‌బ్రిటీ న‌టి త‌న భ‌ర్త చేతిలో చావు దెబ్బలు తిన్న సంఘ‌ట‌న ఇటీవ‌లే చోటు చేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే…ప్ర‌ముఖ టీవీ ఆర్టిస్ట్‌ ఆర్జూ గోవిత్రీకర్ త‌న భ‌ర్త వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్జూ గోవిత్రీకర్ 2010లో ప్రేమించి మ‌రి పెళ్లి చేసుకుంది.తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ సబర్వాల్‌ని వివాహం చేసుకుంది. అయితే పెళ్లి త‌రువాత సిద్ధార్థ్ సబర్వాల్‌లో చాలా మార్పులు వ‌చ్చాయ‌ట‌. మ‌ద్యానికి బానిసై చిత్రహింసలు పెడుతున్నాడట‌. చిత్రహింసలు మ‌రింత ఎక్కువ అవ్వ‌డంతో ఆర్జూ గోవిత్రీకర్ భ‌ర్త‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.వీరిద్ద‌రికి ఓ కొడుకు కూడా ఉన్నాడు.ఈ కొడుకు విష‌యంలో ఇద్ద‌రు త‌రుచు గొడ‌వ ప‌డుతున్నార‌ట‌.

దీనిలో భాగంగానే భ‌ర్త సిద్ధార్థ్ సబర్వాల్ త‌న‌పై శారీరక దాడి దాడి చేసిన వీడియోను కూడా ఆర్జూ పోలీసులకు ఇచ్చింది. ఆ వీడియోలో భ‌ర్త సిద్ధార్థ్ సబర్వాల్ ,ఆర్జూ గోవిత్రీకర్‌ను కొట్టి బాత్‌రూమ్‌లో ప‌డేసిన స‌న్నివేశాలు ఆ వీడియోలో క‌నిపించాయాని తెలుస్తోంది. అయితే ఈ విష‌యంలో భ‌ర్త సిద్ధార్థ్ సబర్వాల్ వాద‌న మ‌రోలా ఉంది. ఆర్జూ గోవిత్రీకర్ సీరియ‌ల్ ఉంది రిహార్సల్స్ చేయమంటే అలా చేశాన‌ని చెబుతున్నాడు. ప్ర‌స్త‌తనికి అయితే ఆర్జూ గోవిత్రీకర్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు సిద్ధార్థ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -